సౌత్ కాంగ్రెస్ కు రింగ్ మాస్టర్ లా మారిన డీకే?
TeluguStop.com
కర్ణాటక ఎన్నికలలో( Karnataka Elections ) కాంగ్రెస్ను అంతా తానే అయ్యి నడిపించిన డీకే శివకుమార్ ఇప్పుడు సౌత్ కాంగ్రెస్కు పెద్దదిగా మారినట్టుగా తెలుస్తుంది .
ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో పునర్ వైభవానికి ఆయన దిక్సూచి గా మారారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో వ్యూహాల దగ్గర నుంచి ఫండింగ్ వరకూ దగ్గరుండి నడిపించిన డీకే శివకుమార్( DK Shivakumar ) కర్ణాటక కాంగ్రెస్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోగలిగినా అనేక సమీకరణాలలో సిద్ధరామయ్య కు ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చింది.
అయినప్పటికీ రాష్ట్ర రాజకీయాలను తన చుట్టూ తిరిగేలా శాసించగలుగుతున్నారు.ఇప్పుడు తెలంగాణ ఎన్నికల కీలక నిర్ణయాలని కూడా శివకుమార్ ప్రభావితం చేస్తున్నాడని , టి .
కాంగ్రెస్ నేతలు ప్రత్యేకమైన నిర్ణయాలన్ని డీకేతో చర్చించే తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
"""/"/ ముఖ్యంగా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ఇప్పటికే పలుమార్లు డీకే ని కలిసి చర్చించారని, అంతేకాకుండా పార్టీలోకి జాయిన్ అవుతున్న తుమ్మల,చేరాతారని ప్రచారం జరిగిన మోత్కుపల్లి నరసింహులు( Mothkupalli Narasimhulu ) కాంగ్రెస్లో చేరడానికి రంగం సిద్దం చేసుకున్న షర్మిల లాంటి నేతలు అందరూ ముందుగా డీకే ను ప్రసన్నం చేసుకునే కాంగ్రెస్ అధిష్టానం తో టచ్ లోకి వెళ్తున్నారు.
ఢిల్లీ పెద్దలతో డైరెక్ట్ ఆక్సిస్ ఉండడంతో పాటు కాంగ్రెస్కు కు ఆపద సమయాలలో ట్రబుల్ షూటర్ గా వ్యవహరించడంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా డీకే ను ప్రత్యేకమైన నాయకుడిగా గుర్తిస్తుంది.
ఆయన నిర్ణయాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది.దాంతో కాంగ్రెస్లో మరెవరికే లేని భిన్నమైన ఇమేజ్ను డీకే సంపాదించుకోగలిగారు .
రాజకీయ అధికారం లేకపోయినా తన వ్యూహ ప్రతి వ్యూహాలతో సరికొత్త ఇమేజ్ డికె క్రియేటె చేసుకోగలోగినట్టుగా తెలుస్తుంది .
"""/"/
అలా కాంగ్రెస్ నాయకులలో అధిష్టానానికి అత్యంత నమ్మకస్తులుగా మారిన అతి తక్కువ మందిలో శివకుమార్ ఒకరిగా మారిపోయారు ఒకప్పుడు అహ్మద్ పటేల్, ప్రణబ్ ముఖర్జీ , వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి అతి కొద్ది మంది మాత్రమే అధిష్టానానికి సన్నిహితులుగా చెలామణి అయ్యారు .
రానున్న రోజులలో డికె పాత్ర మరింత విస్తరిస్తుంది అని 2024 సార్వత్రిక ఎన్నికలలో బాజాపా కి తగిన మెజారిటీ రాకపోతే బేరసారాలకు తెగించే అవకాశం ఉండడం తో తన ఎంపి లను రక్షించే ఆపద్బాంధవుడు అవతారం ఎత్తే శివకుమార్ పై కాంగ్రెస్ ఎనలేని గౌరవాన్ని చూపుతున్నట్టుగా తెలుస్తుంది.
ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చేస్తే బాగుంటుంది.. బాలకృష్ణ కామెంట్స్ వైరల్!