వామ్మో ఈ న్యూస్ రీడర్ ని గుర్తు పట్టారా ? టిల్లు కి తల్లి అంటే నమ్ముతారా ?

డీజే టిల్లు సీక్వెల్ కూడా పూర్తయింది.ఈ సినిమా కూడా 100 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టి 300 కోట్ల వరకు కూడా దూసుకెళ్తోంది.

ఇదే తరహాలో ఎన్ని సినిమాలైనా వస్తాయనీ అని ఇటీవల సినిమా మేకర్స్ ప్రకటించారు.

అయితే డీజే టిల్లు సినిమా గురించి చాలా మందికి తెలియని విషయాలు చాలానే ఉన్నాయి.

అందులో ఒకటి ఈ సినిమా లో నటించిన హీరో తల్లి పాత్ర పోషించిన సుజాత గురించి.

ఇప్పుడు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ఈమె గురించి వెతుకుతున్నారు.సుజాత( Gosukonda Lakshmi Sujatha )కి ఎలాంటి సోషల్ మీడియా ప్రొఫైల్ లేకపోవడంతో నటి సుజాత గురించి వివరాలు ఏమీ దొరకడం లేదు.

డీజే టిల్లు రెండు సినిమాలలో కూడా ఈమె బాగా నటించింది.దాంతో ప్రస్తుతం ఈమెకు వరస పెట్టి టాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయి.

"""/" / ఇక సుజాత విషయానికొస్తే ఈమె గతంలో న్యూస్ రీడర్ గా పని చేసింది అనే విషయం తెలియడంతో అందరూ నోరెళ్ళ పెడుతున్నారు.

అప్పట్లో ఈమె చాలా అందంగా ఉంది.ఎంత బాగుంది అంటే ఈమె ఫోటో చూస్తే అసలు హీరోయిన్ కి ఏ మాత్రం తక్కువ కాదు అన్న విధంగా ఉంది.

అంతేకాదు ఇటీవల ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె గురించిన పూర్తి వివరాలను తెలియజేసింది.

ఆమెకు చిన్నతనం నుంచి సినిమాలు అంటే ఇష్టమని, నటన అంటే మరీ ఇష్టం అని చెప్పింది.

అయితే ఇంట్లో కొన్ని ఇబ్బందులు ఉండటం వల్ల బయటకు వెళ్లడానికి ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోలేదట.

"""/" / కానీ న్యూస్ రీడర్( News Reader ) గా మీడియాలో ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి అందరిని ఒప్పించి ఎలాగోలా మీడియా ఫీల్డ్ కి అయితే వచ్చేసింది.

ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇద్దరు ఆడపిల్లలకు జన్మ కూడా ఇచ్చింది.ఇక తాజాగా ఆమె సినిమా ఇండస్ట్రీకి రావడానికి తల్లి లాంటి ఒక పాత్ర అయితే బెటర్ అనుకొని వచ్చింది.

ఈమెకు సినిమా అవకాశం మొదట తరుణ్ భాస్కర్ ఇచ్చారట.పెళ్లిచూపులు సినిమాలో హీరోయిన్ కి తల్లి పాత్రలో నటించింది సుజాత.

ఆ తర్వాత డీజే టిల్లు( DJ Tillu ) సినిమాలో అవకాశం దక్కింది.

ఈ రెండు సినిమాలు కూడా బాగా విజయం సాధించడంతో సుజాతకు నటిగా మంచి పేరు దక్కింది.

మూడు ప్రపంచాల మధ్య కథ కల్కి.. నాగ్ అశ్విన్ చెప్పిన విషయాలతో అంచనాలు పెరిగాయిగా!