పుట్టుమచ్చల వివాదం.. నాకు మాట్లాడాలని లేదు: నేహాశెట్టి

ఢీజే టిల్లు ప్రస్తుతం ఎక్కడ చూసినా వినిపించే సినిమా పేరు ఇదే.తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల కావడంతో ఈ సినిమా ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది.

ఈ సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉండడమే కాకుండా, సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా హీరోయిన్ నేహా శెట్టిని రిపోర్టర్ అడిగిన ప్రశ్న కారణంగా ఈ సినిమా కాస్త అందరి నోళ్లలో నానుతోంది.

ఈ సినిమా ట్రైలర్ లో హీరోయిన్ కి 16 పుట్టుమచ్చలు ఉంటాయనే విషయాన్ని చూపించారు.

ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం లో భాగంగా జర్నలిస్టు సురేష్ కొండేటి మాట్లాడుతూ సినిమాలో 16 పుట్టు మచ్చలు ఉన్నాయని చూపించారు నిజంగా తనకు ఉన్నాయని తెలుసుకున్నారా అని ప్రశ్నించారు.

ఈ విధంగా జర్నలిస్ట్ అడగడంతో హీరో ఈ ప్రశ్నను దాటవేసారు.అనంతరం సదరు జర్నలిస్టు తన పుట్టు మచ్చల గురించి అడిగిన వీడియోని ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ నేహా శెట్టి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలా జర్నలిస్ట్ పై ఈ హీరోయిన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో సోషల్ మీడియా వేదికగా సదరు జర్నలిస్ట్ గురించి నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.

పెద్ద ఎత్తున కామెంట్లు చేయడం వల్ల ఏకంగా ఆయన నటి నేహా శెట్టికి బహిరంగంగా క్షమాపణలు తెలియజేశారు.

ఇలా ఈ వ్యవహారం ఇంతటితో ముగియకుండా ప్రతిరోజు సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తోంది.

"""/" / ఈ క్రమంలోనే కొంతమంది నెటిజన్లు తెలుగు అర్థం కాకపోవడంతో అసలు ఆ మాటలకు అర్థం ఏమిటి అంటూ అడుగుతున్నారు.

ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఏకంగా డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న శ్రీపాద చిన్మయినీ సమాధానం చెప్పారు.

సదరు నెటిజన్ ఈ విషయాన్ని కాస్త ట్రాన్స్ లేట్ చేసి చెప్పగలరా అంటూ ఆమెకు కామెంట్ చేశారు.

ఇక ఈ విషయంలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీపాద చిన్మయి ఆ కామెంట్స్ హద్దులు దాటేసాయ్.

వాటిని వదిలి పెట్టడం ఎంతో మంచిది అంటూ చిన్మయి చెప్పుకొచ్చారు. """/" / చిన్మయి చెప్పిన సమాధానం చూస్తుంటే ఆమె కనీసం ఈ విషయం గురించి ప్రస్తావించడానికి కూడా ఇష్టపడటం లేదని ఇలా అమ్మాయిల గురించి మాట్లాడే వారిపై ఈమె ఎంతో అసహనం వ్యక్తం చేస్తూ వాటి గురించి మాట్లాడటానికి ఇష్ట పడటం లేదు.

సాధారణంగా మహిళల పై ఏదైనా ఇలాంటి సంఘటనలు జరిగినా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసే చిన్మయి ఒక హీరోయిన్ గురించి ఇలా మాట్లాడటంతో ఈ విషయంపై స్పందించకపోవడం గమనార్హం.

మహిళలపై ఈ విధమైనటువంటి అవమానకర ఘటనలు జరిగిన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలా ఎన్నో సార్లు మహిళలకు మద్దతుగా నిలబడుతూ సోషల్ మీడియాలో ఈమె చేసే పోస్టులు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంటాయి.

"""/" / ఈ క్రమంలోనే కొందరు ఈమెపై నెగిటివ్ కామెంట్ ల వర్షం కురిపించినా మహిళలకు మద్దతుగా నిలబడుతుంది.

అలాంటి చిన్మయి హీరోయిన్ విషయంలో మాట్లాడకపోవడం సదరు రిపోర్టర్ పై ఈమె ఎంత అసహనం వ్యక్తం చేస్తున్నారో అర్థం అవుతోంది.

మొత్తానికి నేహా శెట్టి పుట్టుమచ్చల కారణంగా ఈమె, అదే విధంగా వీరు నటించిన డీజే టిల్లు సినిమా కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.

కాగా ఇదే విషయంపై హీరోయిన్ నేహా శెట్టి మాట్లాడుతూ.ఈ విషయాన్ని ఇంకా పెద్దది చెయ్యాలనుకోవడం లేదు.

ట్రైలర్ లాంచ్ లో జరిగిన బాధాకరమే.ఇలాంటి ప్రశ్నలు రోజు ఎదురువుతుంటాయి.

ఇకపై ఈ విషయం గురించి మాట్లాడనుకోవడం లేదంటూ చెప్పుకోచ్చారు నేహా శెట్టి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్14, గురువారం 2024