విశాఖలో ఘనంగా "డిజె టిల్లు" బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్*

టాలీవుడ్ లెటెస్ట్ సూపర్ హిట్ డిజె టిల్లు.ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది.

దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కించారు.సూర్యదేవర నాగవంశీ నిర్మాత.

సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన డిజె టిల్లు సినిమా గత శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సందర్భంగా సినిమా బ్లాక్ బస్టర్ డిజె టిల్లు వేడుకల్ని విశాఖ గురజాడ కళాక్షేత్రంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో చిత్రబృందానికి జ్ఞాపికల్ని బహూకరించారు.బ్లాక్ బస్టర్ డిజె టిల్లు ఈవెంట్ లో హీరోయిన్ నేహాశెట్టి మాట్లాడుతూ.

డిజె టిల్లు మీకు ఇంత బాగా నచ్చినందుకు సంతోషంగా ఉంది.వైజాగ్ నాకు చాలా ప్రత్యేకం.

నా సక్సెస్ జర్నీ ఇక్కడి నుంచే మొదలైంది.నేను వేరే ఒక సినిమా షూటింగ్ లో విశాఖలో ఉండగా ఈ సినిమా కోసం పిలుపు వచ్చింది.

రాధిక పాత్రను నేను సరిగ్గా పోషించగలను అని నమ్మిన దర్శకుడు విమల్, నిర్మాత నాగవంశీ గారికి కృతజ్ఞతలు.

ఇవాళ మీ రెస్పాన్స్ చూస్తుంటే రాధిక క్యారెక్టర్ లో మెప్పించానని అర్థమవుతోంది అన్నారు.

దర్శకుడు విమల్ కృష్ణ మాట్లాడుతూ.డిజె టిల్లు చిత్రంతో మాకు గొప్ప విజయాన్ని అందించారు.

మీరు ఇచ్చింది సక్సెస్ మాత్రమే కాదు ఒక కొత్త జీవితం.ఓవర్సీస్ సహా మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు.

అన్నారు.హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.

మా 12 ఏళ్ల కల ఈ సాయంత్రం నిజమైంది.మాకు సినిమా తప్ప ఇంకేం తెలియదు.

ఆ సినిమాలతోనే అనుకున్నది సాధించాలని అనుకున్నాం.క్రిష్ణ అండ్ హిస్ లీల సినిమా చేసి ఓటీటీలో రిలీజ్ చేశాం.

అ తర్వాత మా వింతగాథ వినుమా సినిమా చేస్తే ఫర్వాలేదన్నారు.ఇప్పుడు డిజె టిల్లు రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ అంటున్నారు.

ఈ జర్నీలో నేను థాంక్స్ చెప్పుకోవాలనుకునే వ్యక్తి మా నిర్మాత వంశీ అన్న.

మమ్మల్ని నమ్మి సినిమా ఇచ్చారు.మా తలరాత మేమే రాసుకోవాలని చేపట్టిన మా కలం, బలం ఇవాళ విజయం సాధించాయి.

ఎన్ని పాండమిక్ లు, తుఫాన్ లు వచ్చినా మీకు నచ్చే సినిమాలు చేయాలనే మా ప్రయత్నాలు ఆపము.

అన్నారు.నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.

డిజె టిల్లు చిత్రానికి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు.మా సంస్థకు మరో మంచి సక్సెస్ ఇచ్చారు.

డిజె టిల్లు టీమ్ అందరికీ శుభాకాంక్షలు చెబుతున్నా.అన్నారు.

చిరంజీవి కి భారీ సక్సెస్ ఇవ్వడం శ్రీకాంత్ ఓదెల వల్ల అవుతుందా..?