ఫ్లోరిడా : వాల్ట్ డిస్నీ వరల్డ్ రిసార్ట్స్‌లో దీపావళి వేడుకలు .. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
TeluguStop.com
భారతీయుల పండుగలలో దీపావళి( Diwali ) ప్రత్యేకమైంది.చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారనేది పురాణ ప్రాశస్త్యం.
దీపావళి పండుగ అనగానే మనం తెలియకుండానే చిన్నతనంలోకి వెళ్లి పోతాం.జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివాళీ.
ఇప్పుడు ఇది సర్వజన ఆనందకేళిగా మారిపోయింది.భారతదేశంతో పాటు ఇతర దేశాల్లోనూ వెలుగుల పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులు.( Indians ) దీపావళి ఖ్యాతిని ఖండాంతరాలు దాటించారు.
తద్వారా మనదేశంలో జరుపుకునే రోజే దాదాపు అన్ని దేశాల వారు దివాళీని జరుపుకుంటున్నారు.
ఇక మనకు మరో ఇల్లుగా మారిన అమెరికా ( America ) సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఏకంగా అగ్రరాజ్యాధినేత కొలువుండే వైట్‌హౌస్‌లోనే( White House ) దీపావళీ వేడుకలు జరుగుతాయి.
మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌లు శ్వేతసౌధంలో దీపాలు వెలిగించి దీపావళిని జరుపుకున్నారు.
అలాగే 2016లో దీవాళీకి తపాలా బిళ్ళను కూడా అమెరికా విడుదల చేసింది. """/" /
ఈ ఏడాది కూడా అమెరికాలో దీపావళి వేడుకలు ఘనంగా జరగనున్నాయి.
ఇప్పటికే ప్రవాస భారతీయులు, ఎన్ఆర్ఐ సంఘాలు ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి.ఈ ఏడాది తొలిసారిగా ఫ్లోరిడాలోని వాల్ట్ డిస్నీ వరల్డ్ రిసార్ట్‌లో( Walt Disney World Resort ) దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి.
వందలాది మంది నృత్యకారులు భారతీయ సంస్కృతిని చాటిచెప్పేలా ప్రదర్శన నిర్వహించారు.జష్న్ ప్రొడక్షన్స్( Jashn Productions ) హోస్ట్ చేసిన ఈ ఈవెంట్ 400 మంది నృత్యకారులను ఒక చోట చేర్చింది.
"""/" /
జష్న్ ప్రొడక్షన్స్ వ్యవస్థాపకురాలు, అవార్డ్ విన్నింగ్ సౌత్ ఏషియన్ అమెరికన్ డ్యాన్సర్ జీనీ బెరీ( Jeanie Beri ) ఆధ్వర్యంలో డ్యాన్స్ ఫెస్ట్ జరిగింది.
ఆమె నాయకత్వంలో దక్షిణాసియా వాసుల ప్రతిభ వాల్ట్ డిస్నీ వరల్డ్ ఎన్‌బీఏ, బ్రాడ్‌వే స్టేజ్‌లో గుర్తింపు తెచ్చుకుంది.
ఈ కార్యక్రమానికి హాజరైన 1000 మంది అతిథుల ముందు పిల్లలు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశాన్ని పొందారు.
ఈ సందర్భంగా ఎన్ లారెమ్ ఫాండేషన్‌కు 10 వేల డాలర్ల విరాళం అందజేసింది జష్న్ ప్రొడక్షన్స్.
చింతపండు ఆరోగ్యకరమా? కాదా?.. ఎవరెవరు తినకూడదు!