ఈ ఏడాది దీపావళి ఎప్పుడు వచ్చింది.. దీపావళి జరుపుకోవడానికి సరైన సమయం ఇదే..!

హిందువులు జరుపుకునే ఎన్నో ముఖ్యమైన పండుగలలో దీపావళి పండుగ ఒకటి.ఈ పండుగను హిందూ ప్రజలు ఎంతో అంగరంగవైభవంగా ఐదు రోజుల పాటు జరుపుకుంటారు.

దీపావళి పండుగ రోజు సాక్షాత్తు లక్ష్మీదేవి పుట్టినరోజని భావించి అమ్మవారికి పెద్దఎత్తున పూజా కార్యక్రమాలను వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తూ పూజలు చేసుకుంటారు.

ఇలా నరకాసురుడి వధ తర్వాత దీపావళి పండుగను జరుపుకుంటారని మనకు తెలిసిందే.అయితే ఈ ఏడాది దీపావళి పండుగ ఎప్పుడు వచ్చింది, దీపావళి పండుగ జరుపుకోవడానికి సరైన సమయం ఏది అనే విషయానికి వస్తే.

ప్రతి ఏడాది దీపావళి పండుగ కార్తీక మాసం అమావాస్య రోజున జరుపుకుంటారు.ఈ క్రమంలోనే ఈ ఏడాది నవంబర్ 4వ తేదీ దీపావళి పండుగను దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు.

నవంబర్ 4వ తేదీ చతుర్దశి ఉదయం 4:25 నిమిషాలకు ప్రారంభమై ఆ తర్వాత అమావాస్య ప్రారంభం అవుతుంది.

అమావాస్య నవంబర్ 5వ తేదీ ఉదయం 3:51 వరకు ఉంటుంది.పురాణాల ప్రకారం నరకాసురుడి వధకు గుర్తుగా చతుర్దశి రోజున నరక చతుర్దశి నాడు జరుపుకుంటారు.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.అయితే ప్రాంతాలను బట్టి వివిధ రకాల పేర్లతో దీపావళి పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడమే కాకుండా బంధువులు సన్నిహితులకు కానుకలను పంపిస్తూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు.

అలాగే టపాకాయలు కాలుస్తూ ఈ పండుగను ఎంతో వేడుకగా నిర్వహించుకుంటారు.

Viral Video: వీడేంట్రా ఇలా ఉన్నాడు.. పెళ్లి వేదికపై వరుడి ఓవర్ యాక్టింగ్ మాములుగా లేదుగా..!