అనారోగ్యంతో బాధ పడుతున్నా నీట్ పరీక్షలో ఫస్ట్ ర్యాంక్.. ఇతని సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

నీట్ పరీక్ష( NEET )లో ఫస్ట్ ర్యాంక్ సాధించడం సులువైన విషయం కాదు.

ఈ ఏడాది విడుదలైన నీట్ ఫలితాల్లో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు నీట్ పరీక్షలో పాజిటివ్ ఫలితాలను సొంతం చేసుకున్నారు.

నీట్ యూజీ 2024 టాపర్లలో దివ్యాంశ్ ఒకరు కాగా విధి ఆడిన వింత నాటకం వల్ల దివ్యాంశ్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది.

హర్యానాలోని చర్కీ దాద్రీకి చెందిన దివ్యాంశ్ సక్సెస్ స్టోరీ నెట్టింట వైరల్ అవుతోంది.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2024/06/social-media-NEET-yansh-yansh-inspirational-!--jpg" / దివ్యాంశ్ గత కొంతకాలంగా తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యతో బాధ పడుతున్నాడు.

ఆ సమస్య నుంచి కోలుకునే సమయంలో దివ్యాంశ్ కు డెంగ్యూ సోకింది.ఇన్ని ఆరోగ్య సమస్యలు ఎదురైనా దివ్యాంశ్ మాత్రం ఎంట్రెన్స్ టెస్ట్ పై దృష్టి పెట్టి సత్తా చాటారు.

అనారోగ్యం వల్ల ప్రిపరేషన్ విషయంలో సైతం దివ్యాంశ్ కు ఇబ్బందులు ఎదురయ్యాయి.వైద్యపరమైన సవాళ్లను ఎదుర్కొంటూ దివ్యాంశ్( Divyansh ) ప్రశంసలు పొందుతున్నారు.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2024/06/social-media-NEET-yansh-Haryana-Dengue-NEET-UG-yansh-inspirational-success-story!--jpg" / ఊపిరితిత్తులకు బయట ఉన్న ఖాళీ ప్రదేశంలో గాలి చొచ్చుకుపోతే ఈ సమస్య వస్తుంది.

ఈ సమస్య వల్ల ఛాతీ నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

ఈ సమస్య వల్ల చర్మం రంగు కూడా మారే అవకాశాలు అయితే ఉంటాయి.

ఆస్తమా, దగ్గు, క్షయ సమస్యతో బాధ పడేవాళ్లను ఎక్కువగా ఈ ఆరోగ్య సమస్య వేధించే అవకాశాలు అయితే ఉంటాయి.

సమస్య తీవ్రత ఆధారంగా డాక్టర్లు చికిత్స అందించడం జరుగుతుంది.దివ్యాంశ్ కు ప్రభుత్వం నుంచి సపోర్ట్ అందితే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఆరోగ్య సమస్యకు కొన్నిసార్లు సర్జరీ కూడా చేయాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది.

దివ్యాంశ్ సక్సెస్ స్టోరీకి నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఫిదా అవుతున్నారు.దివ్యాంశ్ టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్27, గురువారం 2024