Arnav , Divya : నా మాజీ భర్త ఎంతోమంది అమ్మాయిలను మోసం చేశాడు.. ప్రూఫ్స్ ఇవే?
TeluguStop.com
కోలీవుడ్ బుల్లితెర జంట అర్ణవ్, దివ్యల( Arnav , Divya ) వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.
గత కొద్దిరోజులుగా ఈ జంటకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.
ఈ మధ్యకాలంలో ఈ జంట పేర్లు అంతగా వినిపించకపోయినప్పటికీ తాజాగా మరోసారి ఆమె పలు వ్యాఖ్యలు చేయడంతో ఈ జంట పేర్లు మరోసారి సోషల్ మీడియాలో వారు మారుమోగిపోతున్నాయి.
అయితే ఈ జంట వివాదం రోజు రోజుకి మరింత ముదురుతూనే ఉంది తప్ప కొలిక్కి మాత్రం రావడం లేదు.
బుల్లితెర సెలబ్రిటీలు( Television Celebrities ) అయినా అర్ణవ్, దివ్య ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2023/06/ya-sridhar-arnav-pretended-gay-and-cheated-pilota!--jpg" /
కొద్దిరోజుల పాటు కలిసి ఉన్న వీరు ఆ తర్వాత దివ్య గర్భం దాల్చడంతో తనతో సరిగ్గా మాట్లాడడం లేదని, వింతగా ప్రవర్తిస్తున్నాడని అంతేకాకుండా మరొక నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు అంటూ అర్ణవ్ పై దివ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
కాగా దివ్య అర్ణవ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అతడు ఆమె గర్భిణిగా ఉన్న సమయంలో తనతో విడిపోతున్నట్లు ప్రకటించాడు.
ఇటీవలే పండంటి పాపాయికి కూడా జన్మనిచ్చింది.దివ్య తాజాగా మరోసారి అర్ణవ్‌పై సంచలన ఆరోపణలు చేసింది.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2023/06/ya-sridhar-arnav-pretended-gay-and-cheated-pilotb!--jpg" /
అర్ణవ్ తనను తాను గేగా పరిచయం చేసుకుని ఒక పైలట్ నుంచి డబ్బులు గుంజి మోసం చేయడమే కాకుండా అతడి చావుకు కారణమయ్యాడని ఆరోపించింది.
తననే కాకుండా ఎంతోమంది అమ్మాయిలను కూడా అర్ణవ్ మోసం చేశాడని ఆమె తెలిపింది.
ఈ మేరకు ఆడియో క్లిప్స్‌ను, అమ్మాయిలతో చాటింగ్ చేసిన స్క్రీన్ షాట్ లను కూడా ఇంటర్వ్యూలో బయటపెట్టింది.
ఈ ఆడియో క్లిప్పింగ్స్‌లో ఓ ట్రాన్స్‌జెండర్ మాట్లాడుతూ.అర్ణవ్ 10 ఏళ్ల క్రితమే తనను పెళ్లి చేసుకున్నాడని, కొన్నాళ్లపాటు సంతోషంగా ఉన్నామని, తర్వాత మరో మహిళతో పరిచయం ఏర్పడటంతో తనను వేధించాడని, 8 ఏళ్లు అతడి వేధింపులు భరించానని ఆమె చెప్పుకొచ్చింది.
కాగా దివ్యకు 2013లో ఓ వ్యక్తితో పెళ్లి జరిగింది.పాప కూడా ఉంది.
మనస్పర్థల కారణంగా అతడికి విడాకులిచ్చింది.టీవీ సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలో సహనటుడు అర్ణవ్‌తో పరిచయం ఏర్పడింది.
అది కాస్తా ప్రేమగా మారగా 2022 జూన్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.ఈ క్రమంలో దివ్య గర్భం దాల్చింది.
అయితే ఆమెకు అంతకుముందే పెళ్లై, ఒక కూతురు కూడా ఉందన్న విషయం అర్ణవ్‌కు తెలిసింది.
మరోవైపు చెల్లమ్మ సీరియల్ నటి అన్షితతో అర్ణవ్ ఎఫైర్ నడుపుతున్న విషయం దివ్యకు తెలిసింది.
నవంబర్ నెల బాక్సాఫీస్ రివ్యూ.. వామ్మో ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేదా?