పెళ్లి కాదు.. ఇప్పుడు విడాకులూ సంబరమే! వీడియో వైరల్

సోషల్ మీడియా( Social Media ) ప్రపంచంలో ప్రతి రోజు అనేక వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి.

ముఖ్యంగా పెళ్లిళ్లు, కొత్త జంటల ప్రేమకథలు, వివాహ వేడుకల హంగామాలు మొదలైనవన్నీ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి.

అయితే, ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ కాస్త భిన్నంగా మారుతోంది.పెళ్లిళ్లు కాకుండా, విడాకులనూ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటూ వీడియోలు షేర్ చేయడం కొత్త ఫ్యాషన్‌గా మారుతోంది.

ఇలాంటి ఓ వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేస్తోంది."డివోర్స్ మెహెందీ" పేరుతో పోస్ట్ అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

ఈ వీడియోలో ఓ మహిళ మెహెందీ వేసుకుంది.కానీ ఇది పెళ్లికి గానీ, సంప్రదాయాలకుగానీ కాదు.

ఆమె విడాకుల అనంతరం తనకు లభించిన స్వేచ్ఛను సెలబ్రేట్ చేసుకునేందుకు ప్రత్యేక డిజైన్‌ను ఎంచుకుంది.

ఈ మెహెందీ డిజైన్ సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకు దారితీసింది.మెహెందీ ఆర్టిస్ట్ సంధ్యా యాదవ్( Sandhya Yadav ) తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2025/04/Not-just-marriage-but-now-orce-is-a-celebrationb!--jpg" / ఈ వీడియో మొదట్లో ఆమె చేతిపై ఒక అందమైన బ్రైడల్ మెహెందీ డిజైన్ కనిపిస్తుంది, ఇది పెళ్లి సందర్బంగా వేసుకునే డిజైన్‌లా ఉంటుంది.

కాని కొన్ని క్షణాల్లోనే అది మారిపోతుంది.అదే చేతిపై "Finally Divorce" అనే పదాలు, పక్కనే బ్రోకెన్ హార్ట్ చిహ్నంతో కనిపిస్తుంది.

ఇది నెటిజన్లకు షాక్ ఇచ్చే విధంగా ఉంటుంది.ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిక్స్‌డ్ రియాక్షన్స్ వస్తున్నాయి.

ఈ మధ్య ఇలాంటి వాళ్ళు ఎక్కువయ్యారని కొందరు కామెంట్ చేస్తుంటే.మరికొందరు ఇలాంటి వారి వల్ల పక్కన వాళ్ళు కూడా చెడిపోతున్నారని కామెంట్ చేస్తున్నారు.