అవినాష్ పెళ్లిలో సోహెల్ అరియనా పరువు తీసిన దివి.. ఏం జరిగిందంటే?

తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ ఫోర్ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ అవినాష్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు పెళ్లి పెళ్లి అంటూ ఎంతో హంగామా చేశారు.

ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం అవినాష్ పెళ్లి అనూజతో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ క్రమంలోనే అవినాష్ పెళ్లికి బిగ్ బాస్ కంటెస్టెంట్ లు హాజరై సందడి చేశారు.

అవినాష్ పెళ్లికి సోహైల్, దివి,అరియానా హాజరై పెళ్లిలో అవినాష్ జంట తో కలిసి ఫోటోలు దిగారు.

ఈ క్రమంలోనే ఈ ఫోటోలను దివి తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ సోహెల్ అరీయాన పరువు మొత్తం తీసింది.

ఈ సందర్భంగా అవినాష్ పెళ్లిలో దిగినటువంటి ఫోటోని ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేస్తూ ముందుగా అవినాష్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

అలాగే వీరితో కలిసి దిగినటువంటి ఫోటోలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉండడం చేత వారి గురించి దివి కామెంట్లు చేశారు.

సోహెల్ గురించి మాట్లాడుతూముందు ఫోటో సరిగా వచ్చిందో లేదో చూడాలి ఆతర్వాత అవినాష్ విషెస్ చెబుతామని సోహెల్ చూస్తున్నట్లు పేర్కొంది.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2021/10/riyana-i-avinash-marriage-jabardasth-devi-comments!--jpg "/ ఇక ఆరియాన అడ్రస్ సరిగా ఉందో లేదో చూసుకోవడమే కాకుండా అవినాష్ ఎలాంటి షూస్ వేసుకున్నారు అంటూ తన షూస్ వైపు చూస్తూ నిలబడింది.

ఇక తానైతే భోజనాలు ఎక్కడ పెడుతున్నారా అంటూ ఎదురు చూసినట్లు ఉందని ఈ సందర్భంగా వారి గురించి కామెంట్లు చేసింది.

ఇక అవినాష్ అయితే గిఫ్ట్ తెచ్చారా? లేదా? అంటూ అడుగుతున్నట్లు అవినాష్ గురించి కామెంట్ చేసింది.

ఇలా అవినాష్ పెళ్లిలో పాల్గొని జబర్దస్త్, బిగ్ బాస్ కంటెస్టెంట్ లో ఎంతో సందడి చేశారు.

ప్రస్తుతం అవినాష్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

నయనతార కట్టిన ఈ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా.. హీరోలకు ఏమాత్రం తీసిపోదుగా?