దివిని పొట్లం కట్టేసారుగా.. బిగ్ బాస్ బ్యూటీ ఆనందానికి అవధుల్లేవుగా!
TeluguStop.com
బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొని తన అందంతో యువత మనసులు దోచుకున్న బ్యూటీ దివి.
బిగ్ బాస్ షో తో ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది.పైగా వెండితెరపై అవకాశాలతో ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.
పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మంచి సక్సెస్ అందుకుంది.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.
బిగ్ బాస్ ముందు వెండితెరపై సైడ్ ఆర్టిస్టుగా నటించింది.కానీ అప్పుడు తన గురించి ఎవరికీ తెలియదు.
కానీ బిగ్ బాస్ తో ఓ సెలబ్రిటీ గా మారింది.బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం తన ఆటపాటలతో, మాటలతో అందర్నీ ఫిదా చేసింది.
తన అందంతో అందర్నీ చూపు తిప్పుకోకుండా చేసింది.పైగా టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా కూడా నిలిచింది.
గతంలో ఈమెకు టాలీవుడ్ సినీ దర్శక నిర్మాతలు పలు అవకాశాలు కూడా ఇచ్చారు.
ఇక ఓ ప్రైవేట్ స్పెషల్ సాంగ్ లో చేయగా తన డాన్స్ స్టెప్పులతో బాగా ఆకట్టుకుంది.
అంతే కాకుండా తాను నటించిన క్యాబ్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈ మధ్య తన గ్లామర్ ను కూడా పరిచయం చేస్తుంది.పొట్టి పొట్టి బట్టలతో హాట్ లుక్ లతో బాగా రెచ్చిపోతుంది.
అప్పుడప్పుడు ట్రెడిషనల్ లుక్ తో కనిపించగా తన అందం తో మతి పోగొడుతుంది.
""img Src=" Https://telugustop!--com/wp-content/uploads/2022/05/i-in-packer-bigg-boss-beauty-in-over-happiness-bigg-boss-i-tollywood-packed!--jpg"/
సోషల్ మీడియాలో కూడా ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
తన అభిమానులతో తెగ ముచ్చట్లు కూడా పెడుతుంది.వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంది.
తన డాన్స్ వీడియోలతో, ఫన్నీ రీల్స్ తో బాగా హడావుడి చేస్తుంది.ఇక తన కుటుంబ సభ్యుల ఫోటోలను, తన ప్రాజెక్టు కు సంబంధించిన అప్డేట్లను బాగా షేర్ చేసుకుంటుంది.
నిజానికి ఈ ముద్దు గుమ్మ బిగ్ బాస్ తర్వాత వరుస హిట్లతో బాగా దూసుకెళ్లింది.
ఇక ఇప్పుడు కాస్త నెమ్మదిగా కొనసాగుతున్నట్లు అర్థమవుతుంది.ఇక ట్రెడిషనల్ లుక్ తోనే కాకుండా హాట్ హాట్ లుక్ లతో కూడా దివి తన అందాల విందు వడ్డిస్తోంది.
ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఇన్ స్టా లో ఒక ఫోటో పంచుకుంది.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2022/05/bigg-boss-i!--jpg "/
ఇక ఆ ఫోటో చూసిన దివి ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి.
ఇంతకు ఆ ఫోటో లో ఏముందంటే.ఒక న్యూస్ పేపర్లో దివి ఫోటో ఉండగా ఆ పేపర్ ను పొట్లం కట్టేశారు.
ఇక ఆ ఫోటో చూసిన దీవి అభిమానులు, నెటిజన్లు తెగ నవ్వుకోగా.బాగుంది అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.
ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో బాగా వైరల్ అయింది.ఇక దీవి పలు ప్రాజెక్టులలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.
టాలీవుడ్ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్న ఐటీ.. తెర వెనుక ఇంత జరిగిందా?