దివికి మెగాస్టార్ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నట్లేనా? సినిమా ఎందుకు మారింది!

మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ లో పాల్గొన్న సందర్భం గా ఆ సీజన్ లో ఉన్న దివి కి తన సినిమా లో అవకాశం ఇస్తానంటూ అప్పుడే స్టేజ్‌ పై ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆ సమయం లో మెహర్ రమేష్ దర్శకత్వం లో రూపొందుతున్న భోళా శంకర్ సినిమా లో దివికి ఛాన్స్ ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.

చిరంజీవి కూడా అదే విషయాన్ని చెప్పుకొచ్చాడు.దివి పలు ఇంటర్వ్యూ లో మెహర్ రమేష్ దర్శకత్వం లో తాను నటించబోతున్నట్లుగా పేర్కొంది.

కట్ చేస్తే చిరంజీవి తాజా చిత్రం గాడ్ ఫాదర్ లో దివి కనిపించింది.

అది కూడా ఒక చిన్న పాత్ర లో ఆమె సందడి చేసింది.కథ ను పూర్తిగా ట్విస్ట్‌ చేసే పాత్ర అయినప్పటికీ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా ఉండడంతో దివి కి పెద్దగా గుర్తింపు రాలేదు.

దానితో చిరంజీవి తదుపరి సినిమా భోళా శంకర్ లో కూడా దివి ఉంటుందేమో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2022/10/i-chirenjeevi!--jpg" / చిరంజీవి దివి కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లే.కానీ దివి కాస్త నిరుత్సాహం మరియు నిరాశ లో ఉన్నట్లుగా తెలుస్తోంది.

సినిమా లో ముఖ్య పాత్ర అయితే దక్కింది, కానీ స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంటే బాగుండేది అంటూ ఆమె అభిప్రాయం వ్యక్తం చేస్తుందట.

అందుకే భోళా శంకర్ సినిమా లో ఆమె పాత్ర కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

ఎలాగూ గాడ్ ఫాదర్ సినిమా లో అవకాశం ఇచ్చాము, కనుక భోళా శంకర్ సినిమా ల ఆమె ను పక్క కు పెట్టే అవకాశం లేక పోలేదు అంటూ కొందరు అభిప్రాయం చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి సినిమా లో చిన్న పాత్ర నటించిన కూడా చాలు అని భావించే వారు చాలా మంది ఉన్నారు.

కనుక దివికి గాడ్ ఫాదర్ సినిమా లో ఆ పాత్ర దక్కినా అదే చాలా గొప్ప విషయంగా భావించి.

సినిమా ల్లో మరింత బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తుందేమో చూడాలి.

పులినే తరిమికొట్టిన పెంపుడు కుక్క.. ఈ వీడియో చూస్తే..