వైరల్: నీటి అడుగున డైవింగ్, ఇంతలో అనూహ్యపరిణామం.. ప్రాణంపోయేంత పని అయ్యింది!

ఇక్కడ అనకొండ( Anaconda ) సినిమా చుడనివారు ఎవరూ ఉండరనే చెప్పుకోవాలి.ఈ సినిమాని చూసి చిన్నపిల్లలనుండి పెద్దవాళ్ళ వరకు అందరూ భయబ్రాంతులకు గురయ్యారు.

ఆ సినిమాలో కొండచిలువ నేలపైనే కాదు, నీటిలో కూడా మనుషులతో ఆడుకుంటుంది.ఇవి భారీ సైజులో కదులుతూ ఉంటే చూసేవారికి గగుర్పాటు కలుగుతుంది.

ఇక దానికి ఆకలి వేసిందంటే దాని కంటపడిన ఏ జీవినీ వదిలి పెట్టదని చెప్పుకోవాలి.

అలాంటి కొండ చిలువని మీరు ప్రత్యేక్షంగా చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి? సిస్సు పడుతుంది కదూ.

"""/" / ప్రస్తుతం సోషల్ మీడియాలో( Social Media ) వైరల్ అవుతున్న వీడియోని చూస్తే అదే ఫీలింగ్ కలుగుతోంది.

అవును, ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోని ఒక్కసారి గమనిస్తే.డైవింగ్ చేసిన ఓ వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది.

నీటి అడుగున అతగాడు డైవింగ్‌( Diving ) చేస్తుండగా అతనికి ఓ పెద్ద కొండచిలువ ఆహ్వానం పలికింది.

దాన్ని చూడగానే మొదట అతడు చాలా టెన్షన్ పడ్డాడు.నీటి అడుగు భాగంలోని అందమైన దృశ్యాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంటుంది.

"""/" / మొదట భయపడినా అంతలోనే ధైర్యం తెచ్చుకుని ఆ భారీ కొండచిలువ దగ్గరకు వెళ్ళాడు.

అతను తన చేతిలోని కెమెరాను ఆ పాము ముఖంపై దగ్గరగా పెట్టి వీడియో తీయడం విశేషం.

మరి కొండచిలువకు అతని ధైర్యం నచ్చినట్టుందేమోగాని అతడిని ఏమీ చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఈ ఘటనను అక్కడే ఉన్న మరో వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది.

దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.ఈ కొండచిలువ చాలా భయానకంగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తుంటే.

అతడి టైం చాలా బాగుందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.