గుడివాడ Vs దాడి – రచ్చ కెక్కనున్న వర్గ పోరు ?

గత కొన్ని రోజులుగా విశాఖలోని అనకాపల్లి సీటుపై( Anakapalle ) అనేక రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి 2019 ఎన్నికల్లో ఈ సీటు నుంచి గెలిచిన పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్( Guada Amarnath ) వచ్చే ఎన్నికల్లో ఎలమంచిలి సీటుకి షిఫ్ట్ అవుతారని, అనకాపల్లి సీటు నుంచి 2019లో వైసీపీలో చేరిన దాడి వీరభద్రరావు( Dadi Veerabhadra Rao ) తనయుడు రత్నాకర్ కు సీటు కేటాయిస్తారని వార్తలు వినిపించాయి.

ఇంతకాలం ఇలాంటి వార్తలపై మౌనంగా ఉన్న మంత్రి గుడివాడ నిన్న స్పందించారు.

అనకాపల్లి నుంచి 2024 లో తానే పోటీ చేయబోతున్నానని తాము చేసిన అభివృద్ధి, సంక్షేమం తనను గెలిపిస్తాయి అన్న దీమాను మంత్రి వ్యక్తం చేశారు.

దాంతో దాడి వీర బద్రరావ్ కుటుంబానికి రాజ కీయం గా దారులు మూసుకుపోయినట్లుగా తెలుస్తుంది.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2023/08/disturbances-between-minister-guada-amarnath-and-dadi-veerabhadra-rao-over-anakapalle-seat-detailsa!--jpg" / 2019 ఎన్నికల్లోనే ఎమ్మెల్యే సీటును ఆశించినప్పటికీ చివరి నిమిషం చెరినందున వైయస్ జగన్( YS Jagan ) అంత ఆసక్తి చూపించలేదు అప్పటినుంచి ఓపిగ్గా పార్టీలో చూసినందుకు 2024 లో అయినా టిక్కెట్ దక్కుతుందని భావించిన దాడి ఇంతకాలం అసంతృప్తితోనే కొనసాగారు.

అయినప్పటికీ 2024 ఎన్నికల్లో సీటుపై ఇప్పటివరకు స్పష్టమైన హామీ రాకపోవడం ఇప్పుడు మంత్రి ప్రకటన తో ఆయన ఇతర పార్టీల వైపు చూస్తారని ప్రచారం జరుగుతుంది.

మొదటి ప్రయారిటీగా జనసేన వైపు( Janasena ) చూస్తారని జనసేన కూడా దాడి లాంటి అనుభవజ్ఞుణ్ణి కావాలనుకుంటుందని ఇప్పటికే ఒకసారి పార్టీలోకి ఆహ్వానించినందున దాడి కనుక చేరాలనుకుంటే జనసేనలో దారులు తెరిచే ఉంటాయని భావిస్తున్నారు.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2023/08/disturbances-between-minister-guada-amarnath-and-dadi-veerabhadra-rao-over-anakapalle-seat-detailss!--jpg" / 2019 ఎన్నికల్లో సీటు ఇవ్వకపోయినా తమ అనుచరులతో గుడివాడ అమర్నాథ్ విజయానికి కృషి చేశామని 2024 ఎన్నికల్లో తమ మద్దతు లేకుండా మంత్రి మరోసారి గెలవడం కష్టం అంటూ ఆఫ్ ద రికార్డు దాడి అనుచరులు వ్యాఖ్యానిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

మరి జనసేన తెలుగుదేశం పొత్తులో ఉండి దాడి వర్గం వ్యతిరేకత కూడా పనిచేస్తే గుడివాడ అమర్నాథ్ ఆ సీటులో గట్టెక్కడం కష్టం గానే కనిపిస్తుంది మరి అధికార పార్టీ ఎలాంటి వ్యూహాలు పన్నుతుందో వేచి చూడాలి.

మెంతులతో ఇలా చేశారంటే మీ ముఖంపై ఒక్క మచ్చ కూడా ఉండదు.. తెలుసా?