కేసీఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్దంలో ఉద్రిక్తత…!

సూర్యాపేట జిల్లా: టిఎస్పిఎస్సి ప్రశ్నా పత్రాల లీకేజీలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఉందని,దీనిపై సీబీఐ చేత విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు చేస్తున్న ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం దారుణమని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.

టిఎస్పిఎస్సి పీలిమ్స్ పరీక్షా పత్రాల లీకేజీ కారణంగా రాష్ట్రంలో నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో గురువారం కోదాడ పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ ప్లెక్సీలను కాంగ్రెస్ శ్రేణులు దగ్దం చేస్తుండగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో పోలీసులకు కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగి వాగ్వాదానికి దారితీసింది.

పోలీసుల తీరుతో వారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నినాదాలు చేశారు.అనంతరం కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ అధికార పార్టీకి తొత్తులుగా పోలీసులు పనిచేయడం దారుణమన్నారు.

టీఎస్పీఎస్సి లీకేజీ వ్యవహారంతో రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు మానసిక ఒత్తిడికి గురయ్యారని, ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్లలో వేలకు వేలు ఫీజులు కట్టి చదువుకొనిపరీక్షలు రాస్తే, ప్రభుత్వం పేపర్ లీకేజీ చేసి,వారి జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అదుర్స్ 2 ఆ కారణం చేతే చెయ్యలేదు…ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్!