ప్రపంచ పర్యావరణ దినోత్సవం మొక్కలు నాటిన జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం

రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రపంచ పర్యావరణం దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం సిరిసిల్ల ప్రభుత్వ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భవన పరిధిలో బుధవారం మొక్కలను నాటారు.

ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మిరాజం మాట్లాడుతూ, తక్కువ సమయంలో ఫలసాయానిచ్చే మునగ చెట్లను ప్రతి అంగన్వాడి కేంద్రంలో పెంచాలని మునగ ఆకును పిల్లలకు ఇవ్వడం ద్వారా ఎనిమియాను మనం అరికట్టవచ్చని సూచించారు.

అలాగే పోషణ వాటికలో భాగంగా ఆకుకూరలు, తోటకూరలు, గోంగూర, పాలకూర, బచ్చలి కూర, కొత్తిమీర లాంటి మొక్కల్ని పెంచి లబ్ధిదారులకి ప్రత్యక్ష అవగాహన కల్పించి వారు ప్రతి రోజు ఆహారంలో ఆకుకూరలు ఉండేలాగా ప్రోత్సహించాలని సూచించడం జరిగింది.

కార్యక్రమంలో సఖి కేంద్రం ఇన్చార్జి కోఆర్డినేటర్ విజయ మహిళ సాధికారిక కేంద్రం కోఆర్డినేటర్ రోజా, జెండర్ స్పెషలిస్ట్ దేవిక, రమ్య, అర్చన, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

అయ్యబాబోయ్.. మీరు ఎప్పుడైనా ఇలాంటి గుడ్లను చూసారా?