ఎన్నికల నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు:జిల్లా ఎస్పి చందనా దీప్తి

నల్లగొండ జిల్లా:పార్లమెంట్ ఎన్నికలు నామినేషన్ సమయంలో అభ్యర్థుల, వారి స్టార్ కంపైనర్ మరియు ఎవరైనా నామినేషన్ల సమయంలో సభలు,ర్యాలీలు నిర్వహించేటప్పుడు పోలీసు వారి ముందస్తు అనుమతి పొందాలని జిల్లా ఎస్పీ చందనా దీప్తి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

రాజకీయ పార్టీ నేతల బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించే సమయంలో ఇతర పార్టీ నేతలు చెడగొట్టే ఉద్దేశ్యంతో అక్కడ తమ అనుచరులతో అల్లరి చేయటం,గొడవలు సృష్టించటం, అభ్యంతరకరంగా ప్రవర్తించటం చేయరాదని, నామినేషన్ సమయంలో రాజకీయ పార్టీలు అభ్యర్ధులు ఎవరైనా ప్రజలను ఆకర్షించడానికి కార్యక్రమాలు చేపట్టడం లేదా ప్రజలను ప్రేరేపించడం చేయకూడదన్నారు.

పోటీలో ఉన్న అభ్యర్థి వ్యక్తి గత ప్రతిష్ఠకు భంగం కలిగించే రీతిలో లేదా ఎవరైన అభ్యర్థి తన నామినేషన్ ఉపసంహరించుకునే విధంగా అపవాదులు వేయడం,ప్రకటనలు ఇవ్వడం లాంటివి చేయకూడదన్నారు.

పై ఉల్లంఘలను అతిక్రమిస్తే ఐపిసి సెక్షన్స్ 188,505 (2),171G, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్స్ 123,127 మరియు ఇతర చట్టాల ఉల్లంఘన క్రింద కేసులు నమోదు చేయబడతాయని అన్నారు.

వైరల్ వీడియో: ఛాంపియన్స్‌ ఇన్ ఇండియా .. టీమిండియా ఆటగాళ్లకు గ్రాండ్ వెల్​కమ్..