జిల్లాలో నేరాలకు పాల్పడిన వారికీ జైలు శిక్ష తప్పదు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

కామారెడ్డి జిల్లా( Kamareddy ) బతుకమ్మకుంట చెందిన వెంకల్ వాడ్ మారుతి తండ్రి:తనజీ అనే వ్యక్తి మరియు ,కామారెడ్డి జిల్లా ఇందిరానగర్ చెందిన మండల సాయి కుమార్ తండ్రి:- మల్లయ్య అనే ఇద్దరు వ్యక్తులు సిరిసిల్ల పట్టణ పరిధిలోని మల్లికార్జున వైన్స్ షాప్ ,కార్తికేయ వైన్స్ లలో 19.

02.2023 రోజున దొంగతనాలకు పాల్పడగా, తేదీ 13.

03.2023 రోజున సాయినగర్ కు చెందిన చవహన్ దత్తు నాయక్ తన ఇంటి ముందు పార్క్ చేసిన దిచక్ర వాహనం దొంగతనానికి పాల్పడగా అదే రోజు సాయినగర్ కు చెందిన ఉల్చే ప్రశాంత్ అను అతను తన ఇంటిలో దొంగతనికి పాల్పడగా సిరిసిల్ల పోలీసు స్టేషన్లో పై వారు అందరు పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పై కేసులలో దొంగతనం చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది.

విచారణ అనంతరం విచారణ అధికారి శ్రీకాంత్,చీన నాయక్ లు కోర్టులోచార్జిషీట్ దాఖలు చేయగా CMS ఎస్ రవీందర్ నాయుడు ఆధ్వర్యంలో, కోర్టు కానిస్టేబుల్ నరేష్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరుపున చెలుముల సందీప్ గారు వాదించినారు.

కేసు పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి ప్రవీణ్ గారు నేరస్తులు అయిన మారుతి, సాయికుమార్ లకు నాలుగు కేసులలో ఒక (1)సంవత్సరం కఠిన కారాగార జైలు శిక్ష తో పాటు రెండు వందల రూపాయల జరిమానా విదించడం జరిగింది.

2.వాహన చోరీ కేసులో ఒకరికి ఏడు నెలల జైలుశిక్ష.

తేదీ 6-02-2014 దెగావత్ చంద్రు తన ద్విచక్ర వాహనం చోరీ జరిగిందని సిరిసిల్ల పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసాడు.

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వాహనం దొంగిలించిన గంభీరావుపేటకి చెందిన అంకం రాజు ని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసారు.

ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెలుమల సందీప్ వాదించగా, కోర్టు కానిస్టేబుల్ నరేష్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు.

కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి అంకం రాజుకు ఏడు నెలల జైలు శిక్ష విధిస్తూ సిరిసిల్ల ప్రథమశ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ తీర్పు వెల్లడించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని, శిక్షలతోనే సమాజంలో మార్పు వస్తుందని, పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ మరియు న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు.

పైకేసులలో నిందితులకి శిక్ష పడటం లో కృషి చేసిన పీపీ చెలుమల సందీప్,CMS ఎస్.

ఐ రవీంద్రనాయుడు, కోర్ట్ కానిస్టేబుల్ లు నరేష్ జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

ఇప్పుడు చేయబోయే సినిమాతో రామ్ పోతినేని సూపర్ హిట్ కొడుతాడా..?