అనారోగ్యంతో మృతి చెందిన పోలీస్ జాగిలం ట్యాంగో పుష్పగుచ్చాలు వేసి నివాళులర్పించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.,

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) హెడ్ క్వార్టర్ లో గత 08 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న (జర్మన్ షెఫర్డ్) సంతతికి చెందిన పోలీస్ జాగిలం ట్యాంగో అనారోగ్యంతో ఈ రోజు ఉదయం మరణించినది.

జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్( Head Quarters) లో పోలీస్ అధికారులు , పోలీస్ జాగిలం హ్యాండ్లర్ లక్ష్మణ్ తో కలసి ట్యాంగో పై పుష్పగుచ్ఛాలు వేసి ఘనంగా నివాళులర్పించి ట్యాంగో సేవలు మరువలేనివని సంతాపాన్ని వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ .

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ట్యాంగో గత 08 సంవత్సరాల నుండి జిల్లాలో 15 హత్య కేసులలో, 84 దొంగతనాలలో మొత్తంగా 99 కేసులలో నిందుతులను , గుర్తించడంలో చాకచక్యంగా వ్యవహరించి విధులు నిర్వహించదని కొనియాడారు.

2017 సంవత్సరంలో ట్యాంగో తన హ్యాండ్లర్ లక్ష్మణ్ తో పాటుగా ఎనిమిది నెలల పాటు IITA,మొయినాబాద్ నందు బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని జిల్లాకు కేటాయించగా జిల్లాలో 08 సంవత్సరాలుగా సేవలందించిందని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్.ఐ లు యాదగిరి, మాధుకర్, రమేష్, రాజా హ్యాండ్లర్ లక్ష్మణ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఆ విషయంలో టాలీవుడ్ ను ఫాలో అవుతున్న బాలీవుడ్…