వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల పట్ల తక్షణమే స్పందించాలి.సైబర్ మోసాలు, మాధకద్రవ్యాల పట్ల కలుగు అనర్ధాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ శుక్రవారం రోజున తనిఖీ చేసి పోలీసు స్టేషన్ పరిసరాలు,రికార్డుల నిర్వహణ,విధులలో భాగంగా మెయింటేన్ చేసే రిసెప్షన్, జీడీ ఎంట్రీ తదితర రికార్డును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.

పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు సైబర్ మోసలపై, మాధకద్రవ్యాల పట్ల జరుగు అనర్ధాలపై అవగాహన కల్పించాలన్నారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని,ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు.

పోలీస్ స్టేషన్ పరిధిలో రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నడుస్తున్నాయని అడిగి తెలుసుకొని ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24x7 గస్తీ నిర్వహించాలన్నారు.

స్టేషన్ పరిధిలో సైబర్ మోసాల గురించి, గంజాయి వలన కలుగు అనర్ధాల గురించి అవగాహన కల్పించాలని సూచించారు.

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ పట్టణ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు,సిబ్బంది కృషి చేయాలని,అధికారులు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి శాంతిభద్రతలు అదుపులో ఉంచాలని సూచించారు.

రోడ్ ప్రమాదాల కొరకు స్టేషన్ పరిధిలో ప్రతి రోజు వాహనాల తనిఖీ చేపట్టాలన్నారు.

స్టేషన్ పరిధిలోని ప్రజలకి మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ డ్రైవింగ్, రాంగ్ రూట్, ర్యాష్ డ్రైవింగ్ ,మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే అనార్దల పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

ఎస్పీ వెంట వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి,సి.ఐ వీరప్రసాద్,ఎస్.

ఐ అంజయ్య సిబ్బంది అన్నారు.

ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే ఇంట్లో దోమలన్నీ ప‌రార్ అవ్వాల్సిందే!