సిరిసిల్ల డిఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం రోజున సిరిసిల్ల డిఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసి సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలోని దర్యాప్తు కేసుల స్థితిగతులతో పాటు నేరస్తుల అరెస్టు సంబంధించిన అంశాలపై తనిఖీ చేసి ప్రతి కేసులో నేరస్తులకు శిక్షలు పడే విధంగా క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని సూచించారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.శాంతిభధ్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారం ప్రాధాన్యతగా విధులుండాలన్నారు.

ఎస్సీ,ఎస్టీ,ఫోక్సో కేసులలో నేరస్తులకు నిందితులకు శిక్షలు పడే విధంగా క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని సూచించారు.

క్రైమ్ ఎగినెస్ట్ ఉమెన్ ,ఎస్సీ, ఎస్టీ కేసులలో త్వరగతిన పరిశోధన పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని సూచించారు.

సబ్ డివిజన్ స్థాయి అధికారి పరిధిలోని పోలీస్ స్టేషన్లను తరచు సందర్శిస్తూ స్టేషన్ అధికారులు, సిబ్బంది పనితీరుపై ఎప్పటికప్పడు పర్యవేక్షణ చేయడంతో పాటు కేసుల్లో దర్యాప్తు వేగవంతంగా జరిగేందుకు స్టేషన్ అధికారులకు పలు సూచనలు అందించాలన్నారు.

సబ్ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ అమలు చేయాలని,ప్రధానంగా రౌడీ షీటర్ల వ్యవహారంపై నిరంతరం నిఘా పెట్టడంతో పాటు, కొత్తగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై నూతనంగా రౌడీ షీట్లు తెరవాలన్నారు.

శాంతి భద్రతలకు సంబంధించి నిరంతరం పర్యవేక్షణ చేస్తూనే అప్రమత్తంగా ఉండాలన్నారు.ఎస్పీ వెంట సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.

అల్లు అర్జున్ కి ఇష్టమైన సినిమా ఏంటో తెలుసా..? ఆ సినిమాను ఇప్పటి వరకు ఎన్ని సార్లు చూశాడంటే..?