తంగాలపల్లి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది విశ్రాంతి వసతి గదులను ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖలో పని చేస్తున్న పోలీస్ అధికారుల,సిబ్బంది యెక్క సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుదని జిల్లా ఎస్పీ అన్నారు.
తంగాల్లపల్లి పోలీస్ స్టేషన్ సందర్శన సమయంలో సిబ్బంది తమకు విశ్రాంతి గదులు లేక ఇబ్బంది పడుతున్నామని తమ దృష్టి తీసుకవచ్చిన నేపధ్యంలో పోలీస్ స్టేషన్ లో విశ్రాంతి గదులను నిర్మించి పోలీస్ అధికారులు, సిబ్బందితో కలసి ఈ రోజు ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.24/7 విధులు నిర్వహించే సిబ్బందికి విశ్రాంతి ఎంతో అవసరం అని దానికి అనుగుణంగా తంగాలపల్లి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది కి విశ్రాంతి గదులు నిర్మించడం జరిగిందన్నారు.
జిల్లాలో పని చేస్తున్న సిబ్బంది యెక్క సంక్షేమం విషయంలో జిల్లా పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని,వారికి అవసరమైనా అన్ని రకాల సౌకర్యాల కల్పనకు చర్యలు తిసుకోవడం జరుగుతుందన్నారు.
పోలీస్ సిబ్బందికి ఆరోగ్యం,సంక్షేమాం విషయంలో అధిక ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో సిబ్బంది మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించి ప్రజల మన్నాలు పొందాలన్నారు.
సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకొని ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకరవలన్నారు.
పోలీస్ సిబ్బంది సంక్షేమానికి జిల్లా ఎస్పీ తీసుకుంటున్న చర్యలు పట్ల హర్షం వ్యక్తం చేసిన సిబ్బంది.
ఎస్పీ వెంట అదనపు ఎస్పీ చంద్రయ్య, రూరల్ సి.ఐ సదన్ కుమార్, టౌన్ సి.
ఐ ఉపేందర్ ,ఎస్.ఐ వెంకటేశ్వర్లు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
అల్లు అర్జున్ అరెస్టు… వైరల్ అవుతున్న వేణు స్వామి వీడియో!