సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.
స్టేషన్ పరిసరాలను, స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల వివారలు, రికార్డ్ లు, స్టేషన్ రికార్డ్ లు తనిఖీ చేసి కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని,ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లను ప్రతి రోజు తనిఖీ చేయాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నడుస్తున్నాయని అడిగి తెలుసుకొని డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలన్నారు.
స్టేషన్ పరిధిలో సీసీటీవీల ఏర్పాటు పై దృష్టి సారించి సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు.
స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్ కు ప్రాధాన్యత సూచించారు.సిరిసిల్ల పట్టణ పరిధిలో గణేశ్ ఉత్సవాలు ( Ganesh Utsav Celebrations )ప్రజలు శాంతియుతంగా వాతావరణంలో జరిగేలా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని,గణేష్ మండపాలను అధికారులు, సిబ్బంది తరచు సందర్శిచాలని, మండపాల నిర్వహకులకు సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే చిన్న స్పీకర్లను వినియోగించుకోవలని, మండపాల్లో, శోభాయాత్ర సమయంలో డిజే ఏర్పాటుకు అనుమతి లేదని వివరించి చెప్పాలని ఆదేశించారు.
ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ కృష్ణ సిబ్బంది ఉన్నారు.
బాలయ్య బాబీ కాంబో మూవీలో ముగ్గురు హీరోయిన్లా.. క్లైమాక్స్ లో అలాంటి ట్విస్ట్ ప్లాన్ చేశారా?