భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తం అయిన జిల్లా పోలీస్ యంత్రంగం.

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) సిరిసిల్ల పట్టణంలో మున్సిపల్ చైర్ పర్సన్ ,పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులతో క్షేత్రస్థాయిలో పర్యటించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan )జిల్లా వ్యాప్తంగా సహాయక చర్యలు చేపట్టిన జిల్లా జలమయమయ్యే ప్రాంతాలలోని ప్రజలను పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు.

నర్మల ఎగువ ఎగువ మానేరు నీటి ఉధృతి ఎక్కువ స్దాయిలో ఉండటంతో ఎగువ మానేరు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,అటు వైపుగా ఎవరు కూడా వెళ్ళవద్దని తగు సూచనలు జారీ చేశారు.

ప్రజలు ప్రమాదాల భారీన పడకుండా వంతెనలపై రాకపోకలను నిషేధించి బారికేడ్లు,ఫ్లెక్సీ లు ఏర్పాటు చేసి గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని ఆన్నారు.

ఏలాంటి ఆటంకాల కలగకుండా తక్షణమే ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.12 మందితో కూడిన జిల్లా డిఆర్ఎఫ్ టీమ్( DRF Team ) 24 గంటలు అందుబాటులో ఉంటుంది అని అన్నారు.

పిల్లలు, యువకులు సెల్ఫీలు తీసుకోవడానికి, ఈతలు కొట్టడానికి నీటి ప్రవాహాల దగ్గరికి వెళ్లకుండా తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు.

విపత్కర సమయాల్లో సహాయం కోసం డయల్100కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అంధిస్తే తక్షణ సహాయక చర్యలు చేపడతామని ఈ సందర్భంగా ఎస్పీ తెలియజేశారు.

ఆగష్టు చివరి వారంలో ప్రేక్షకులను అలరించే చిత్రాలివే.. సరికొత్త రికార్డ్స్ ఖాయమా?