రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

రాజన్న సిరిసిల్ల: రాజ్యాంగ దినొత్సవం పురస్కరించుకొని మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో రాజ్యాంగానికి సంబంధించిన ప్రతిజ్ఞను సిబ్బంది, అధికారులతో జిల్లా కలెక్టర్ చేయించారు.

బ్రీటీష్ వారు 200 కు పైగా సంవత్సరాలు భారతదేశాన్ని పాలించిన తరువాత మనకు స్వాతంత్ర్యం లభించిందని, మన రాజ్యాంగం రచించడానికి కమిటి ఎర్పాటు చేసి రెండు సంవత్సరాల పాటు చర్చించి 1949 నవంబర్ 26న తుది రాజ్యాంగం ఆమోదించబడిందని తెలిపారు.

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశమైన భారతదేశానికి గొప్ప రాజ్యాంగం ను అందించారని అన్నారు.

2015 సంవత్సరం నుంచి రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా మారిందని, దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించేందుకు పలువురు విద్యావేత్తలు, న్యాయనిపుణులు, వివిధ రంగాల ప్రముఖులతో రాజ్యాంగ నిర్మాణ సభను ఏర్పాటు చేశారని, 2సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని డ్రాఫ్ట్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగం రూపొందిందనీ పేర్కొన్నారు.

సి.పి.

ఓ.శ్రీనివాసా చారి, డి.

పి.ఆర్.

ఓ.వి.

శ్రీధర్, ఉపాది కల్పనాధికారి రాఘవేందర్, మున్సిపల్ కమిషనర్ లావణ్య, కలెక్టరేట్ ఏ.ఓ.

రామ్ రెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు జావేద్ అహ్మద్, శ్రీకాంత్, పుష్పాలత, షరీఫ్, వేణు, ప్రవీణ్, కలెక్టరేట్ సిబ్బంది, సంబంధిత అధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

షాకింగ్ పోస్ట్ చేసిన బన్నీ ..వెంటనే డిలీట్ మళ్లీ పోస్ట్.. ఎందుకంత టెన్షన్?