ప్రజావాణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత కల్పించాలి::జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

కార్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ప్రతి ఫ్రై డే ప్రభుత్వ కార్యాలయాల్లో డ్రై డే నిర్వహణ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత కల్పించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.

సోమవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు పి.

గౌతమి, ఖీమ్యా నాయక్ లతో కలిసి పాల్గొని ప్రజల అర్జీలను స్వీకరించారు.

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూలోక్ సభ ఎన్నికల విజయవంతంగా నిర్వహించ డంలో అధికారులు సఫలీకృతులయ్యారని కలెక్టర్ అభినందించారు.

పరిపాలనలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత అందించాలని, పెండింగ్ ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ పేర్కొన్నారు.

ప్రజావాణి కి వచ్చి మనకు దరఖాస్తు ఇచ్చిన ప్రతి దరఖాస్తుదారుడికి జవాబుదారితనంతో పని చేయాలని, సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని, అధికారులు నాణ్యతతో కూడిన పని చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.

మనకు ప్రజావాణి కార్యక్రమంలో అధికంగా రెవెన్యూ భూ లవాదేవీల సంబంధిత దరఖాస్తులు , పెన్షన్ల మంజూరు దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ సూచించారు.

మన జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించి 54 దరఖాస్తులు, ఉపాధి కల్పనకు సంబంధించి 11 దరఖాస్తులు మొదలగు వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 121 ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయని వీటిని వీలైనంత త్వరగా పరిష్కారం చేయాలని కలెక్టర్ సూచించారు.

వర్షాకాలం రానున్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలలో పరిశుభ్రత పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సీజనల్ వ్యాధులను నియంత్రణకు ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలలో సైతం ఎక్కడ నీటి నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాస్థాయిలో మండల స్థాయిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా ప్రతి ఫ్రైడే ఫ్రైడే నిర్వహించాలని, నీటి నిల్వలను తొలగించి శుభ్రం చేయాలని, మన కార్యాలయ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పి.గౌతమి, కిమ్యా నాయక్, అర్.

డి.ఓ.

లు రమేష్, రాజేశ్వర్, జిల్లా మరియు మండల స్థాయి అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

నోటి పూతతో తరచూ ఇబ్బంది పడుతున్నారా.. అయితే మీ డైట్ లో ఈ డ్రింక్ ఉండాల్సిందే!