సీఎం రాక నేపథ్యంలో పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

డీ.పీ.

ఓ.భవనం ప్రారంభానికి ఏర్పాట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా :ఈ నెల 7వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి రాక నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయ(డీపీఓ) భవనం ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం ఆవరణలోని డీ.పీ.

ఓ భవనాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం పరిశీలించారు.

సి.ఎం.

పర్యటన నేపథ్యంలో చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు జారీ చేశారు.హెలిప్యాడ్ వద్ద స్థలాన్ని పరిశీలించారు.

సి ఎం పర్యటించే ప్రదేశాల చుట్టూ మొత్తం పచ్చదనంతో, అనవసరపు చెట్ల పొదలను తొలగించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ మరియు ఇతర అధికారులకు కలెక్టర్ తగు ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం సిరిసిల్ల లోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భవనాన్ని పరిశీలించి, అక్కడ చేపట్టాల్సిన పనులపై జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజంకు సూచించారు.

అలాగే అపెరాల్ పార్క్ లో పారిశ్రామిక వేత్తలకు కేటాయించనున్న షెడ్లను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు.

అక్కడి నుంచి నేరుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం ఆవరణలో జాతర ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.

అలాగే రగుడు సమీపం లోని తాటి వనాన్ని పరిశీలించారు.ఈ పర్యటన లో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, ట్రైనీ ఎస్పీ రాహుల్ రెడ్డి, వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ పంచాక్షరి, అగ్నిమాపక అధికారి వెంకన్న, డీఆర్డీఓ శేషాద్రి, ఏడీ మైన్స్ రఘుబాబు, డీఎస్పీలు భీం శర్మ, నాగేంద్రచారి, టెక్స్టైల్ ఏడీ సాగర్, డీటీసీపీఓ అన్సారీ, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.

అమానుషం.. బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన డాక్టరమ్మ..