చంద్రగిరిలో వృక్షార్చన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

భావితరాలకు ఆహ్లాదకరమైన జీవన విధానం అందించే దిశగా మనమంతా మొక్కలు నాటి వాటి సంరక్షణకు తోడ్పడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.

శనివారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమం( Crore Tree Planting Program )లో భాగంగా చంద్రగిరి గ్రామంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( District Collector Anurag Jayanthi ) మొక్కలు నాటారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, స్వాతంత్ర్య వజ్రోత్సవ ముగింపు వేడుకలలో భాగంగా ప్రభుత్వం ఒకేరోజు రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటేందుకు వృక్షార్చన కార్యక్రమం చేపట్టిందన్నారు.

మన భవిష్యత్తు తరాలు ఆహ్లాదకర జీవనం కొనసాగించేందుకు అభివృద్ధి సంపదతో పాటు మంచి వాతావరణం, కాలుష్యరహిత పర్యావరణం అందించడం చాలా ముఖ్యమని, చెట్ల ద్వారా ప్రాణవాయువు లభిస్తుందని, నేడు పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తే భవిష్యత్తులో చెట్లుగా ఎదిగి పర్యావరణ సమతుల్యత పాటించడంలో దోహదపడతాయని కలెక్టర్ అన్నారు.

పర్యావరణ సమతుల్యత కోసం, పచ్చదనం పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, పట్టణ ప్రకృతి వనాలు, సంపద వనాలు పేరుతో పలు కార్యక్రమాలను అమలు చేస్తుందని, ప్రజలు సైతం స్వచ్ఛందంగా మంచి కార్యక్రమంలో పాల్గొని భవిష్యత్ తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి జీవన ప్రమాణాలు అందించే దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపు నిచ్చారు.

కార్యక్రమంలో జడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి, అదనపు డి ఆర్ డి ఓ మధు సూదన్ తదితరులు పాల్గొన్నారు.

కొండా సురేఖపై పరువు నష్టం దావా.. నాగ్ కు అనుకూలంగా తీర్పు రావడం ఖాయమా?