ఆకలి చావులను ఆపేందుకు గోధుమల పంపిణీ.. ఏ దేశంలో అంటే
TeluguStop.com
ప్రపంచ దృష్టిని ఆవర్షించిన దేశం ఏదైనా ఉందంటే అది ఆఫ్గనిస్తాన్.ఇక్కడ తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అరాచకాలు అన్నీ ఇన్ని కావు.
వారి రూల్స్‌ను ఎవరు అతిక్రమించినా మరణమే.ఆ రేంజ్‌లో వారి రాక్షస పాలన ఉంటోంది.
మొన్నటి దాకా అంతో ఇంతో అభివృద్ధి వైపు వెళ్తున్న ఆ దేశం ఒక్కసారిగా కుదేలైపోయింది.
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది.విపరీతంగా నిరుద్యోగం, నిరుపేదరికం పెరిగి ప్రజలు ఆకలి కేకలతో అల్లాడి పోతున్నారు.
రీసెట్ గా ఇలాంటి దారుణ ఘటన జరిగింది.అదేంటంటే పశ్చిమ కాబూల్‌లో ఎనిమిది మంది వరకు ఆకలి కేకలతో మరణించడం తీవ్ర విషాదం నింపింది.
కాగా ఇలాంటి ఆకలి కేకలను ఆపేందుకు తాలిబన్ ప్రభుత్వం ఇప్పుడు మరో నిర్ణయం తీసుకుంది.
అదేంటంటే దేశంలో నిరుద్యోగంతో పాటుగా ఆకలి కేకలను ఆపేందుకు పనికి గోధుమల పంపిణీ అనే కొత్త స్కీమ్‌ను తెరమీదకు తీసుకొచ్చింది.
దీని అర్థం ఏంటంటే ఎవ్వరైతే పని చేస్తారో అలాంటి వారందరికీ డబ్బులకు బదులు గోధుమలు ఇస్తారన్న మాట.
దీంతో కొద్దిగా అయినా ఆకలి చావులను అధిగమించొచ్చని వారి ఆలోచన """/"/
ఎందుకంటే ఇప్పటికే ఆఫ్గనిస్తాన్ దేశంలో ఓ రేంజ్‌లో పేదరికంతో పాటు కరువు అలాగే కరెంటు కోతల్లాంటివి ప్రజలను అల్ల కల్లోలం చేసేస్తున్నాయి.
తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ప్రజలు కనీసం తినడానికి కూడా తిండి లేక, చేసుకుందామంటూ పనుల్లేక ఇబ్బంది పడుతున్నారు.
ఇప్పుడు శీతాకాలం రావడంతో మరిన్ని ఇబ్బందులు వస్తున్నాయి.ఈ క్రమంలోనే తాలిబన్లు ముందస్తు జాగ్రత్తగానే డబ్బులకు బదులుగా గోధుమలను పంచేందుకు రెడీ అవుతున్నారన్న మాట.
అయితే కేవలం ఇలా గోధుమలతో సరిపెడితే రాబోయే కాలంలో సమస్యలు పూర్తిగా పరిష్కారం కావని అభిప్రాయపడుతున్నారు నిపుణులు.
కాగా ప్రస్తుత పరిస్థితిపై ప్రపంచం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఈ పొడిని నిత్యం తీసుకుంటే మీ కంటి చూపు పెరగడం గ్యారెంటీ!