ఐఏయూవైఎస్ఏ ఆధ్వర్యంలో క్రికెట్ క్రీడాకారులకు టీ- షర్ట్స్ పంపిణీ

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎస్.పి.

మ్యాస్ట్రో వారు స్థాపించిన ఇంటర్నేషనల్ ఓమౌజయ యునైటెడ్ యంగ్ స్టార్స్ అసోసియేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ లక్ష్యాలలో భాగంగా యువత శారీరక, మానసిక దృఢత్వం తో జీవించాలని, దానికోసం నిరంతరం యువతను క్రీడలలో ప్రోత్సహించడంలో ఐఏయూవైఎస్ఏ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని ఐఏయూవైఎస్ఏ అధ్యక్షులు తిరుమల రిషి అన్నారు.

ఎల్లారెడ్డి పేట మండలం వెంకటాపురం గ్రామ యువత నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా మంగళవారం ఫైనల్ మ్యాచ్ లో విజేతలకు, రెండవ స్థానంలో నిలిచిన రెండు జట్టు సభ్యులకు టి షర్ట్స్, జ్ఞాపికలు మరియు బ్యాట్ లను ప్రోత్సాహకంగా ది సెలబ్రేటింగ్ పాత్ అఫ్ ఎన్లైటన్మెంట్ సంస్థ ప్రతినిధులు శ్రీ పరమో బ్రహ్మశాస్త్రజ్ఞ, శ్రీ పరమో త్రిగునాత్మక సిద్ధ కలిసి ఐఏయూవైఎస్ఏ అధ్యక్షులు తిరుమల రిషి, వర్కింగ్ ప్రెసిడెంట్ పురుషోత్తం గారి చేతుల మీదుగా అందించారు.

ఈ కార్యక్రమంలో ఐఏయూవైఎస్ఏ కోర్ టీం సభ్యులు హుస్సేన్ బాషా, వంశీ, టోర్నమెంట్ నిర్వాహకులు రాజేందర్, క్రికెట్ క్రీడాకారులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

అఖండ సీక్వెల్ లో ఆ ఒక్క సీన్ కు పూనకాలు పక్కా.. థమన్ హామీ ఇచ్చేశారుగా!