ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా పిల్లలకు క్రీడా సామాగ్రి పంపిణీ
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) గంభీరావుపేట మండలం రాజుపేట గ్రామానికి చెందిన చిన్నారులకు అబ్బాయిలకు క్రికెట్ కిట్, అమ్మాయిలకు వాలీబాల్ కిట్లను ఈరోజు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో పర్శ హన్మాండ్లు పంపిణీ చేశారు,
ఈ సందర్భంగా పర్శ హన్మాండ్లు మాట్లాడుతూ తనకు క్రీడలు అంటే చాలా ఇష్టమని చదువుకునే రోజుల్లో క్రికెట్( Cricket ) అంటే అమితం గా ఇష్టపడే వాడినని పిల్లలను క్రీడలలో ప్రోత్సహించేందుకే ఈ క్రీడాసామాగ్రిని పంపిణీ చేసినట్లు పర్శ హన్మాండ్లు తెలిపారు.
పిల్లలు చదువుతోపాటు ఆటపాటలతో రాణించాలన్నారు.శారీరక వృద్ధికి ,మానసిక వికాసానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
పోటీ తత్వాన్ని స్నేహ భావాన్ని పెంపొందించేందుకు క్రీడలు ఎంతో తోడ్పాటును అందిస్తాయన్నారు.తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) రాష్ట్రంలోక్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి గ్రామీణ క్రీడలను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారన్నారు.
ఇక్కడ యూత్ నాయకులు మహేష్, భరత్ ,రాజేష్ తదితరులు ఉన్నారు.
ఏపీ టెట్ పరీక్షలో 150కు 150 మార్కులు.. అశ్విని సక్సెస్ స్టోరీకి గ్రేట్ అనాల్సిందే!