కీళ్ళ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి కుటుంబానికి బియ్యం వితరణ..
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి అంబేద్కర్ నగర్ కు చెందిన దాసరి దేవయ్య గత కొద్దిరోజులుగా కీళ్ల వ్యాది బారిన పడ్డాడు .
ఏ పని చేసుకునే పరిస్థితిలో లేనందున ఆయన కుటుంభ ఆర్థిక పరిస్థితి దీనంగా మారడంతో గ్రామానికి చెందిన చైతన్య యూత్ సభ్యులు 25 కిలోల బియ్యం ,
రాచర్ల గొల్లపల్లి బి ఆర్ ఎస్ గ్రామ శాఖ నాయకులు అందె సురేష్,వెంకటేష్ లు మరో25 కిలోల బియ్యం వితరణ చేసి వారి ఔదార్యాన్ని చాటుకున్నారు.
దాసరి దేవయ్య దీన పరిస్థితిని గుర్తించి దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని వారు కోరారు.
తమ కుటుంబానికి బియ్యం వితరణ చేసిన తమ ఔదార్యాన్ని చాటుకున్న యువకులకు దాసరి దేవయ్య దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.
వైరల్ వీడియో: పాఠాలు వింటూనే గుండెపోటుకు గురైన చిన్నారి.. చివరకి?