గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ కేసిఆర్ తోనే సాధ్యమయ్యింది – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా మానాల: బాల్కొండ నియోజకవర్గం మానాల గ్రామం,తండాల్లో పలు అభివృద్ది పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం, పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాల్లో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మానాల గ్రామ ప్రజలు, మనాల తండా గ్రామ పంచాయితీల ప్రజలు మంత్రికి ఘన స్వాగతం పలికారు.

దారి పొడవునా పూలు చల్లుతూ మంత్రికి నీరాజనం పలికి, గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

మంత్రి చే సేవలాల్ మహారాజ్ పూజ చేయించారు.అబివృద్ధి కార్యక్రమాల వివరాలు.

హనుమాన్ తండా గొర్రె గుండం రోడ్ 1.12 కోట్లతో పనులకు శంకుస్థాపన, మానాల రుద్రాంగి రోడ్ పై తాతమ్మ బ్రిడ్జి నిర్మాణ పనులకు 2.

20 కోట్లతో శంకుస్థాపన,మానాల మున్నూరు కాపు పటేల్ ఫంక్షన్ హాల్ లో గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ చేశారు.

పలు కుల సంఘ భవన నిర్మాణాలకు నిధుల మంజూరు ప్రొసీడింగ్ కాపీల అందజేశారు.

అనంతరం 20 లక్షలతో నూతనంగా నిర్మించిన దేగావత్ తండా గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్బంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గానికి చివరి గ్రామమైన మనాల అంటే తనకు సొంత గ్రామంతో సమానంగా చూస్తానని,ఇక్కడి తండా ప్రజల కల్మషం లేని ప్రేమ తనకు ఇష్టమన్నారు.

ఇవాళ మనాలా గిరిజన ప్రజల 762 కుటుంబాలకు 1750ఎకరాలు పోడు పట్టాలు పంపిణీ చేసుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు.

ఇక నుండి మీ భూములకు మీరే రారాజులు అని, గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ ఒక్క కేసిఆర్ తోనే సాధ్యమయ్యింది అన్నారు.

ఇది మరెవ్వరితోనూ సాధ్యపడదని మంత్రి స్పష్టం చేశారు.లంబాడీలు అంటే తనకు అత్యంత ఇష్టమని లంబాడీలు అబద్ధాలు ఆడరున్నారు.

ఒక్క ఊరి కోసం వంద కోట్ల పైగా అభివృద్ది పనులు జరిగాయనీ, మానాల ప్రజలను అంతా నా కుటుంబ సభ్యులలాగే చూసానని చెప్పారు.

మానాల గ్రామంలో 11 కులాలకు సంఘ భవనాలకు తీజ్, సేవాలల్ భవనాలు 67 లక్షలు,60 లక్షలు ఇతర సంఘ భవనాలకు ఇచ్చామని మొత్తం ఒక్క గ్రామంలోనే 1.

27 కోట్లు సంఘ భవనాలకు నిధులు ఇచ్చామని చెప్పారు.16 తండాలు ఉంటే 4 గ్రామ పంచాయితీలు అధికారులు ప్రపోజల్ చేస్తే.

గిరిజన ప్రజల అభీష్టం మేరకు తాను 8 గ్రామ పంచాయితీలు చేయించాననీ అన్నారు.

తీజ్ పండుగకు మహిళకు తీజ్ భవనాలు/సేవాలాల్ భవనం ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే ఇచ్చాం.

రాష్ట్రంలో ఇట్లా ఎక్కడ లేదన్నారు.గృహలక్ష్మి పథకం ఇప్పుడు కొంత మందికి ,వచ్చే సారికి మిగిలిన వారికి ఇస్తామని, అర్హులై పెన్షన్లు రానివారికి కూడా ఇస్తామని హామీ ఇచ్చారు.

మీలో ఒక్కడిగా మీ ప్రాంత అభివృద్ది కోసం కృషి చేశాను.గిరిజన ప్రజల చిరకాల కోరికలను సీఎం కేసిఆర్ దయతో నెరవేర్చానని అన్నారు.

మానాల గ్రామ, తండాల ప్రజల ఆశీర్వాదం కేసిఆర్ కు,తనకు ఎప్పుడూ ఉండాలని కోరారు.

రానున్న రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ది చేసుకుందామని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు,గిరిజన ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్ లో కొత్త ఇల్లు కడుతున్న అల్లు అర్జున్.. ఏకంగా అలాంటి సౌకర్యాలతో?