తండ్రి జ్ఞాపకార్థం గ్లాసుల వితరణ

రాజన్న సిరిసిల్ల జిల్లా :పలు ప్రభుత్వ పాఠశాల( Government School )ల్లో ప్రధానోపాధ్యాయులు గా పనిచేసి పదవీ విరమణ పొంది చనిపోయిన తన తండ్రి వంగ రామేశ్వర్ రెడ్డి జన్మదినం, ఆయన్ స్మారకార్డం తన తనయుడు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిషన్ దాస్ పేట లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గల 120 మంది విద్యార్థులకు రాగి జావ తాగడానికి గ్లాస్ లను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్దులకు అందజేశారు.

ఇటీవల పాఠశాలలో నెలకొన్న సమస్యల పై స్థానిక మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్( Oggu Balaraju Yadav ) నూతనంగా విధుల్లో చేరిన ప్రధానోపాధ్యాయురాలు రజిత తో చర్చించగా 120 మంది విద్యార్థులకు ప్రతి రోజు రాగిజావ తాగడానికి గ్లాస్ లు అవసరమని చెప్పారు.

ఈ విషయాన్ని జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి దృష్టికి మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ తీసుకెళ్లగా అట్టి గ్లాస్ లను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గిరిధర్ రెడ్డి అందజేశారు.

ఈ సందర్భంగా 120 మందికి రాగి జావ తాగడానికి గ్లాస్ లు అందించిన గిరిధర్ రెడ్డి కి, గ్లాస్ లు అందించేందుకు సహకరించిన బాలరాజు యాదవ్ కు ప్రధానోపాధ్యాయురాలు రజిత తో పాటు అమ్మ ఆదర్శ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ నేవూరి మానస ,మాజీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్, ఉపాద్యాయ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.

అదే విధంగా పాఠశాలలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా చేయడానికి కృషి చేసిన ప్రధానోపాధ్యాయురాలు రజిత ను ఈ సందర్భంగా నాయకులు శాలువాతో సన్మానించారు.

ఇటీవల ఎనిమిది గురుకుల సీట్లు పొందిన విద్యార్థులకు అదే పాఠశాలలో పనిచేస్తున్న అంజలి అనే ఉపాధ్యాయురాలు తన స్వంత డబ్బులతో గోల్డ్,సిల్వర్ మెడల్స్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నాయకులు మాట్లాడుతూ పాఠశాలలో మౌళిక వసతుల సౌకర్యం కోసం కృషి చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో వంగ గిరిధర్ రెడ్డి తో పాటు మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్,మాజీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్,విద్యా కమిటీ మాజీ చైర్మన్ కులేరి కిషోర్ కుమార్,పాఠశాల కమిటీ డైరెక్టర్ ఒగ్గు మహేష్ చంద్ర యాదవ్,శ్రీ వేణు గోపాలస్వామి ఆలయ కమిటీ వైస్ చైర్మన్ గంట వెంకటేష్ గౌడ్, శివరాత్రి దేవరాజు తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

వీడియో: టోక్యో, పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ మెడల్స్ మధ్య డిఫరెన్సెస్ చూశారా..?