హైదరాబాద్ లో చేప ప్రసాదం పంపిణీ.. ఏర్పాట్లు పూర్తి
TeluguStop.com
హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం( Fish Prasad ) పంపిణీ కార్యక్రమం జరుగుతోంది.
స్పీకర్ గడ్డం ప్రసాద్ ( Speaker Gaddam Prasad
)తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించారు.
ఇందులో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు బత్తిని హరినాథ్ గౌడ్ చేప ప్రసాదం వేశారు.
మృగశిరి కార్తి సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపప్రసాదం పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
ఈ క్రమంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బత్తిని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోందని తెలిపారు.
ఈ నేపథ్యంలో చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.
కీళ్ల నొప్పుల నివారిణి కరక్కాయ.. ఎలా వాడాలో తెలుసా?