వెంకటాపూర్ లో కాంగ్రెస్ పార్టీ కరపత్రాల పంపిణీ..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రైతుల సమస్యలతో కూడిన కరపత్రాలను సోమవారం ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా గ్రామ శాఖ కమిటీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కరపత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి ఇప్పటికీ కూడ రుణమాఫీ ప్రక్రియ పూర్తిగా కాలేదని అన్నారు.

రైతులకు ఉచితంగా ఎరువులు అందిస్తామని వాగ్దానం చేసిన మాట నెరవేర్చలేదన్నారు.రైతులకు వరి పంట నష్టం జరిగితే ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం చెల్లించలేదన్నారు.

48 గంటల్లో రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ చేస్తామని నెల రోజులు గడిచిన జమ చేయలేదని,రైతు వేదికలను రాజకీయాల కోసం వాడుకోవడం అన్యాయమని తదితర అంశాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు.

పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కరపత్రాలను పంపిణీ చేశామన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మామిండ్ల కిషన్, దేవచంద్రం, నగేష్, బుచ్చి రాములు, నరసయ్య, భూమ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

నాగబాబు కు కాదు.. మళ్లీ వారికే రాజ్యసభ ఛాన్స్ ?