సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ…
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla District )ఎల్లారెడ్డిపేట మండలంలోని బండలింగంపల్లి గ్రామంలో సీఎం సహాయనిధి కింద మంజూరైన 24 వేల రూపాయల చెక్కును కే రాజుకు సోమవారం అందజేశారు.
ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్(Congress ) అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి(Chief Ministers Relief Fund ) నుండి చాలామంది పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కులను అందజేస్తున్నామన్నారు.
రానున్న కాలంలో కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి ఇండ్లను కూడా మంజూరు చేస్తామన్నారు.
ఒక్కొక్క ఇంటికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల సహాయం చేస్తుందని అన్నారు.విదేశాలలో చదువుకునే పిల్లలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ,జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, నాయకులు కొత్తపల్లి దేవయ్య,చెన్ని బాబు,గుండాటి రామ్ రెడ్డి,వాడ్నాల ఆంజనేయులు,గొల్లపల్లి మల్లేశం,గోపాల్, శ్రీనివాస్,ఎండి ఇమామ్,రమేష్,హైమద్ ఎల్లా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టిస్టులకు రాజమౌళి కొత్త కండిషన్స్ పెడుతున్నాడా..?