తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిరుపేదల కు దుస్తులు, పండ్లు పంపిణీ

రాజన్న సిరిసిల్ల జిల్లా:తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil ) ఆదేశాల మేరకు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా (హెల్పింగ్ హాండ్స్ టూ డె్స్టిట్యూట్ లో భాగంగా)వేములవాడ రూరల్ మండలం లో నిరుపేద వ్యక్తులకు వేసుకోవడానికి బట్టలు, పండ్లు పంపిణీ చేయటం జరిగిందని వేములవాడ రూరల్ ఎస్ ఐ నాగరాజు తెలిపారు.

ఈ సందర్బంగా ఎస్ ఐ నాగరాజు మాట్లాడుతూ రేపటి రోజున (04-06-2023) పోలీస్ సురక్ష దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో,మహిళ భద్రత షి టీమ్,పోలీస్టేషన్ గురించి తెలుసుకోనుట అలాగే పోలీస్ ఎగ్జిబిషన్ మేళ ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు దానికి రూరల్ మండల ప్రజలు హాజరు కావాలని కోరారు.

పోలీస్ ల ఆధ్వర్యంలో జరిగే దశబ్ది ఉత్సవాలకు ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమం లో సిబ్బంది ఏ ఎస్ ఐ లక్ పతి, కానిస్టేబుల్ రాజశేఖర్ పాల్గొన్నారు.

అన్నా క్యాంటీన్ల వివాదం… అడ్డంగా బుక్ అయిన మెగా హీరో…మామూలు ట్రోల్ కాదుగా!