బీజేపీలో మొదలైన అసమ్మతి రాగం...ఢిల్లీ పర్యటన ఇందుకేనా?
TeluguStop.com
తెలంగాణ బీజేపీ రోజు రోజుకు బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారాలనే ఉద్దేశ్యంతో పావులు కదుపుతున్న పరిస్థితి ఉంది.
అయితే బీజేపీ ఒకప్పుడు చాలా బలహీనంగా ఉండేది.కాని కాలక్రమేణా బలపడుతున్న తరుణంలో చాలా మంది కీలక నేతలు బీజేపీలో చేరడంతో ఇక బీజేపీ అనేది ఒక్కసారిగా కాస్త బలపడింది.
అయితే తాజాగా కరీంనగర్ జిల్లా బీజేపీ పార్టీలో ఒక్కసారిగా అసమ్మతి రాగం వినిపించింది.
దీంతో జిల్లా రాజకీయ పరిస్థితులపై, రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపై అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరును కూడా తరుణ్ చుగ్ తో జరిగిన సమావేశంలో ప్రస్తావించిన పరిస్థితి ఉంది.
అయితే ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ కు వ్యతిరేకంగా సుగుణాకర్ లాంటి నేతలు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న పరిస్థితి ఉంది.
అయితే కెసీఆర్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ టీఆర్ఎస్ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలలో టీఆర్ఎస్ తో కలిసి వచ్చే నాయకులతో మంతనాలు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే నేడు జరిగిన భేటీలో ఇక రానున్న రోజుల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై తరుణ్ చుగ్ కీలక సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇక రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాలలో ఎలాగైతే గెలుపు కొరకు వ్యూహాలు రచించారో తెలంగాణలో కూడా అదే తరహా వ్యూహాలు రచించే అవకాశం వందకు వంద శాతం ఉంది.
దీనికి ఇప్పటి నుండే గతంలో ఎన్నడూ లేని విధంగా మత తత్వ ఘర్షణ వాతావరణం అనేది రానున్న రోజుల్లో అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు జరగడం, శాంతిభద్రతల సమస్యను సృష్టించడం, తెలంగాణలో హిందువులకు రక్షణ లేదనే ఒక ప్రచారాన్ని పెద్ద ఎత్తున భ్రమింపజేసి ఇక తెలంగాణలో బీజేపీ తరహా రాజకీయ వాతావరణాన్ని పెంపొందించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
ఈ హోమ్ మేడ్ సీరం తో లాంగ్ అండ్ స్ట్రాంగ్ హెయిర్ మీ సొంతం..!