వైసీపీలో అసమ్మతి నేతలు.. వాళ్లే పార్టీని ముంచుతున్నారట..!!
TeluguStop.com
ఏపీలో వైసీపీ నేతలు విచిత్ర భ్రమలో బతుకుతున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.రాష్ట్రంలో తమపై ఎంత వ్యతిరేకత ఉన్నా వైసీపీ నేతలు మాత్రం కవర్ చేసుకుంటూనే ఉన్నారని.
తాము లక్షల కోట్లు అప్పులు తెచ్చి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే తమ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎలా ఉంటుందని వైసీపీ మంత్రులు కొట్టిపారేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.
మరోవైపు ప్రతిపక్షాలను చిన్నచూపు చూస్తూ వైసీపీ మంత్రులు ప్రతిపక్షాల నేతలను బండబూతులు తిడుతూ పబ్బం గడుపుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మరోవైపు వైసీపీ వ్యతిరేక పత్రికల్లో ఇటీవల ఆ పార్టీ చేపట్టిన సామాజిక న్యాయభేరీ బస్సు యాత్రకు ప్రజల ఆదరణ దక్కలేదని.
మంత్రుల సభలకు ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయని కథనాలు వచ్చాయి.ఇందులో వాస్తవం ఎంత ఉందనే విషయం పక్కన పెడితే వైసీపీ కార్యక్రమాలకు సంబంధించి అసమ్మతి నేతలే వ్యతిరేక మీడియాకు సమాచారం ఇస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ విషయంపై సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి నేతలు మేధో మథనం చేశారు.
"""/" / ఆయా జిల్లాల నుంచి అనుకూల వర్గాలతో రిపోర్టులు తెప్పించుకున్నారు.
సొంత పార్టీ నాయకులే పార్టీ కార్యక్రమాలకు గండి కొడుతున్నారని రిపోర్టుల ద్వారా బహిర్గతమైంది.
రాజమండ్రిలో ఓ అసమ్మతి నేత నేరుగా రంగంలోకి దిగి ప్రజలకు వాట్సాప్ సందేశాలు పంపుతారట.
కార్యక్రమానికి మంత్రులు రావడం ఇంకా లేటవుతుందని.వచ్చాక సందేశం పంపిస్తాం.
అప్పుడు రావాలని సూచించారట. """/" /
దీంతో ఇటీవల మంత్రులు నిర్వహించిన సభకు వచ్చిన జనం వెనక్కి వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.
తీరా మంత్రులు వచ్చాక.పట్టుమని పది మంది కూడా రాలేదు.
మరోవైపు విజయవాడ బెంజి సర్కిల్‌లో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓ కీలక అధికారి నిర్వాకంతో సభకు వచ్చిన జనం వెనక్కి వెళ్లిపోయారట.
దీంతో అసమ్మతి నేతలపై కఠిన చర్యలు తీసుకునేలా పార్టీ అధిష్టానం సిద్ధమవుతోందని తెలుస్తోంది.
సీఎం పదవినే వద్దనుకున్న సోనూసూద్.. ఈ హీరో నిజంగా గ్రేట్ అని అనాల్సిందే!