TDP : వలసలు ఓవర్ లోడ్ అన్నారు కదయ్యా ? వైసీపీ నుంచి క్యూ పెరుగుతోందా ?

tdp : వలసలు ఓవర్ లోడ్ అన్నారు కదయ్యా ? వైసీపీ నుంచి క్యూ పెరుగుతోందా ?

ఏపీ అధికార పార్టీ వైసీపీ( YCP ) కొద్ది రోజులుగా తమ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను విడతల వారీగా ప్రకటిస్తూ వస్తోంది.

tdp : వలసలు ఓవర్ లోడ్ అన్నారు కదయ్యా ? వైసీపీ నుంచి క్యూ పెరుగుతోందా ?

దీంతో టికెట్ దక్కని నేతలంతా అసంతృప్తికి గురై టిడిపిలో( TDP ) చేరేందుకు సిద్ధమైపోయారు.

tdp : వలసలు ఓవర్ లోడ్ అన్నారు కదయ్యా ? వైసీపీ నుంచి క్యూ పెరుగుతోందా ?

ఇప్పటికే చాలామంది నేతలు టిడిపిలో చేరుపోగా,  మరి కొంత మంది టికెట్ హామీ దక్కితే చేరేందుకు సిద్ధం అన్నట్లుగా సంకేతాలు ఇస్తున్నారు.

దీంతో వలస నేతలతో రాబోయే రోజుల్లో ముప్పు తప్పదని , టిడిపి ఓవర్ లోడ్ అయ్యే ప్రమాదం ఉందని పార్టీలో చేరేందుకు వైసిపి నేతలు పెద్ద ఎత్తున  సిద్ధమవుతున్నారని, అయితే వారంతా టికెట్ ఆశించి వస్తున్న వారే కావడంతో,  వారి కారణంగా నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు పార్టీ ని నమ్ముకుంటూ, టికెట్ తమదే అన్న ధీమాతో  పని చేసుకుంటున్న నేతలు అసంతృప్తికి గురై , గ్రూపు రాజకీయాలకు కారణం అవుతారని చంద్రబాబు( Chandrababu Naidu ) ఆందోళన చెందుతున్నారు.

అందుకే చేరికల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.వలస నేతలందరినీ పార్టీలోకి చేర్చుకునే విషయంలో చంద్రబాబు రెండు రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు.

బుధవారం పార్టీ నాయకులతో మాట్లాడిన చంద్రబాబు ఇక వైసిపి నేతలను( YCP Leaders ) చేర్చుకునేది లేదని తేల్చి చెప్పారు కానీ వైసిపి లోని అసంతృప్తి నాయకులు టిడిపిలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉండడం , వారిలో కీలక నేతలు చాలామంది ఉండడంతో,  """/" / కొంతమంది విషయంలో సడలింపులు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తున్నారు.

ఈ మేరకు కొంతమంది వైసీపీ నుంచి వచ్చిన నేతలతో చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు.

ఈ లిస్ట్ లో నరసరావు పేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు( MP Sri Krishna Devarayalu ) ఉన్నారు.

చంద్రబాబును ఉండవల్లి నివాసంలో కలిసిన శ్రీ కృష్ణ దేవరాయలు పార్టీలో చేరే విషయమే చర్చించారు.

  ఆయన చేరితే నరసరావుపేట టికెట్ ఇచ్చే విషయంలోనూ చంద్రబాబు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.

నరసరావుపేట పరిధిలోకి వచ్చే  అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిడిపి నేతలను గెలిపించుకునే బాధ్యత శ్రీకృష్ణదేవరాయలపైనే చంద్రబాబు పెట్టినట్లు సమాచారం.

అలాగే వైసిపి సీనియర్ నేత అట్లా చిన్న వెంకటరెడ్డి( Atla Chinna Venkatreddy ) కూడా చంద్రబాబు ను ఆయన నివాసంలో కలిశారు.

"""/" / వంద కార్లతో భారీ కాన్వాయ్ తో వెంకటరెడ్డి వచ్చారు.ఈయన టిడిపి టికెట్ ఆశిస్తున్నారు .

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏ నియోజకవర్గంలో నుంచి తనకు అవకాశం ఇచ్చినా గెలుస్తాననే ధీమా ను చంద్రబాబు ముందు ఉంచారు.

నూజివీడు టికెట్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఆశిస్తున్నారు.దీంతో ఆయన్ను  చంద్రబాబు ఆహ్వానించారు.

ఈసారి కి పార్టీ నిర్ణయానికి కట్టుబడాలని , పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారట.

ప్రస్తుత వైసిపి పెనుమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి కి నూజివీడు టికెట్ ను చంద్రబాబు ఖాయం చేయబోతున్నారు.

ఇక మరికొంతమంది కీలక నేతలను చేర్చుకునే విషయంలోనూ ఇదేవిధంగా సడలింపులు ఇవ్వాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారట.