ఇదేంటి నాయకా ! వలస నేతలకు ప్రాధాన్యం పై వైసీపీ లో అసంతృప్తి ?
TeluguStop.com
ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తు జరుగుతుంది.
అయితే దీనిపై ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తులు నేలకొన్నాయి.మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉంటూ.
ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయడమే కాకుండా, ఎన్నో త్యాగాలు చేసిన కీలక నాయకులను పక్కనపెట్టి ఇతర పార్టీల నుంచి వలస వస్తున్న నాయకులకు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవుల్లో ప్రాధాన్యం కల్పిస్తుండడం, అలాగే ఇతర పదవుల్లోనూ వలసనేతలకి ఎక్కువగా ప్రాధాన్యం కల్పిస్తుండడంపై, మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన నాయకుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది.
కేవలం ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎంపికైన కాకుండా గతంలోనూ రాజ్యసభ సభ్యత్వాల విషయంలోనూ జగన్ ఇదేవిధంగా వ్యవహరించారని,
టిడిపిలో కీలకంగా పని చేసిన వారిని వైసీపీలోకి తీసుకువచ్చి వెంటనే వారికి రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ముఖ్యంగా టిడిపిలో కీలకంగా ఉన్న బీద మస్తాన్ రావు ను వైసీపీలోకి తీసుకువచ్చి ఆయనకు వెంటనే రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చారని , అలాగే తెలంగాణకు చెందిన బీసీ నేత ఆర్.
కృష్ణయ్యను పార్టీలో చేర్చుకుని ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారని, """/" /
ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లోను టిడిపి మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణను పార్టీలు చేర్చుకుని, ఇప్పుడు ఎమ్మెల్సీ ఇస్తుండడంపై తీవ్ర అసంతృప్తి నెలకొంది.
ప్రస్తుతం ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఫైనల్ కాబోతున్న అభ్యర్థుల్లో చాలామంది ఇతర పార్టీలో కీలకంగా ఉన్నవారు వైసిపికి వ్యతిరేకంగా పనిచేసిన వారే కావడంతో, జగన్ వైఖరి పార్టీ నేతలకు అర్థం కావడం లేదు.
పార్టీ కోసం కష్టపడి, """/" /
జైలుకు వెళ్లి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేసిన వారికి చాలాకాలంగా పదవులు కట్టబెట్టలేదని , కానీ వలస నేతలకు ఈ స్థాయిలో జగన్ ప్రాధాన్యం ఇస్తారని ఊహించలేదని అని, అన్ని పార్టీలకు భిన్నంగా వైసిపి ఉంటుందని భావించినా, ఇప్పుడు అన్ని పార్టీల బాటలోనే జగన్ కూడా సామాజిక వర్గాలు, ఎన్నికల్లో విజయవకాశాలు ఇలా అన్నిటిని లెక్కలు వేసుకుంటూ, తమను పక్కన పెడుతున్నారనే బాధ పార్టీ సీనియర్ నాయకులు, జగన్ సన్నిహితుల్లోనూ వ్యక్తం అవుతుంది.