Bollineni Ramarao : నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీలో అసంతృప్తి గళం

నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీలో అసంతృప్తి గళం వినిపిస్తోంది.ఈ మేరకు కలిగిరిలో అనుచరులు, అభిమానులతో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు( Bollineni Ramarao )భేటీ అయ్యారు.

ఈ క్రమంలోనే ఉదయగిరిలో తప్పకుండా పోటీ చేస్తానని తేల్చి చెప్పారు.చివరిగా చంద్రబాబుని కలుస్తానని తెలిపారు.

చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్న పోటీ చేయడం మాత్రం ఖాయమని పేర్కొన్నారు. """/" / ఈ క్రమంలోనే ఆత్మీయ సమావేశంలో బొల్లినేని కన్నీంటి పర్యంతం అయ్యారు.

పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో అండగా ఉన్నానన్నారు.అయితే ఉదయగిరి నియోజకవర్గ టికెట్ ను ఎన్ఆర్ఐ కాకర్ల సురేశ్( Kakarla Suresh ) కు ఇచ్చే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

టికెట్ తనకు ఇవ్వనందుకు బాధ లేదన్న ఆయన చంద్రబాబు( Chandra Babu Naidu ) తీరు బాధను కలిగిస్తుందని వాపోయారు.

టీడీపీలో బ్రోకర్లు రాజ్యమేలుతున్నారని ఆరోపించారు.

వీడియో: ఈ చిన్నారి ఎంత డ్రామా చేస్తుందో చూస్తే నవ్వాపుకోలేరు..