దేశవ్యాప్తంగా పేటీఎం సేవలకు అంతరాయం..

దేశంలోని ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ లలో పేటీఎం ఒకటి.పేటీఎం యాప్ కి ఎన్నో లక్షల మంది యూజర్లు ఉన్నారు.

ప్రతిరోజు ఎంతో మంది ఈ యాప్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు.అలాంటి ఈ యాప్ సేవలకు అంతరాయం ఏర్పడింది.

తాజాగా పేటీెఎం ట్రాన్సాక్షన్స్ జరగలేదు.దీని వెబ్ సైట్, యాప్ లోకి లాగిన్ చేయడంలో యూజర్లు ఇబ్బందులు పడ్డారు.

లాగిన్ అయ్యేందకు ప్రయత్నించినా.ఆటోమెటిక్గా లాగవుట్ అవుతోంది.

పేటీఎం యాప్ పనిచేయకపోవడంతో యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు.చాలా మంది ట్విట్టర్ ద్వారా పేటీఎంకి ఫిర్యాదులు వచ్చాయి.

ఆన్ లైన్ యాప్స్ పరిశీలించే డౌన్ డిటెక్టర్ కు శుక్రవారం ఉదయం 10 గంటలకే 611 ఫిర్యాదులు అందాయి.

పేటీఎం పనిచేయడం లేదని 66 శాతం మంది, యాప్ లో సమస్యలు ఉన్నాయని 29 మంది ఫిర్యాదు చేశారు.

దేశంలో ముంబై, ఢిల్లీ, బెంగళూరులో పేటీఎం యాప్ పని చేయకపోవడంతో యూజర్లు చాలా ఇబ్బంది పడ్డారు.

ఈ విషయంపై పేటీఎం స్పందించింది.యాప్ లో నెట్ వర్క్ సమస్య వల్లే అంతరాయం ఏర్పడిందని పేటీఎం అంగీకరించింది.

నెట్ వర్క్ సమస్యను పరిష్కరించినట్లు ఉదయం 11.30 గంటల సమయంలో ట్వీట్ చేసింది.

"""/"/ ఇక యాప్, వెబ్ సైట్ లో టెక్నికల్ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని పేటీఎం వెల్లడించింది.

ఐటీ సిబ్బంది ఈ సమస్య నుంచి గట్టెక్కించేందుకు కృషి చేస్తున్నారని తెలిపింది.ఏమైనా సమస్యలు వస్తే యూజర్లు ‘సపోర్ట్@పేటీఎంమనీ.

కాం’కు మెయిల్ చేయాలని పేటీఎం కోరింది.ఇప్పుడు యాప్ కూడా ఎప్పటిలాగే పనిచేస్తోంది.

సమస్య పరిష్కారం కావడంతో వినియోగదారులు తమ ట్రాన్సాక్షన్స్ చేసుకోగలుగుతున్నారు.ఇక పేటీఎం డౌన్ కావడంతో సోషల్ మీడియాలో యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘పేటీఎండౌన్’ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు.

కోమటిరెడ్డి బ్రదర్స్ పై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్