ఆ అవినీతి ఎమ్మెల్యేలను డిస్క్వాలీపై చేయాలి: ధర్మార్జున్

సూర్యాపేట జిల్లా:దళిత బంధు పథకంలో ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అంగీకరించినందున ఆ ఎమ్మెల్యేలను డిస్క్వాలీఫై చేసి,వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ డిమాండ్ చేశారు.

శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ తన పాలనలో అవినీతికి తావు లేదని ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రి తన ఎమ్మెల్యేలపై ఏం చర్య తీసుకుంటారో చెప్పాలని ధర్మార్జున్ కోరారు.

కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి,ఆయన అనుచరగణం ఆదినుండి అన్ని రంగాల్లో అవినీతికి పాల్పడ్డారనే ప్రతిపక్షాల ఆరోపణను ఎట్టకేలకు కేసీఆర్ అంగీకరించారని, రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు,ఎమ్మేల్యేలు, వారి అనుచరులు అవినీతికి,భూదందాలకు, ఇసుక దందాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

దళిత బంధు కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

పవన్ అంటేనే ఇష్టం.. కమెడియన్ అలీ సంచలన వ్యాఖ్యలు!