ఎన్ఆర్ఐతో భూ వివాదం .. పంట కోసేందుకు యత్నం, కాల్పులతో వణికిన పల్లెసీమ
TeluguStop.com
విదేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐల ఆస్తులు,( NRI's Properties ) భూములు అక్రమార్కుల చేతుల్లో నలిగిపోతున్నాయి.
తెలిసినవారు , బంధువులే ప్రవాస భారతీయుల ఆస్తులను కబ్జా చేస్తున్నారు.దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్ధితులే ఉన్నాయి.
తాజాగా పంజాబ్‌లో( Punjab ) ఎన్ఆర్ఐ భూముల విషయంలో చోటు చేసుకున్న ఘర్షణ ఏకంగా కాల్పులకు దారి తీసింది.
సిధ్వాన్ బెట్ ప్రాంతంలోని తరాఫ్కోట్లి గ్రామంలో( Taraf Kotli Village ) ఎన్ఆర్ఐతో ఓ వ్యక్తికి చాలా కాలంగా భూ వివాదం( Land Dispute ) ఉంది.
ఈ వివాదాస్పద భూమి నుంచి గోధుమలు కోసే ప్రయత్నంలో ఘర్షణ చోటు చేసుకుంది.
ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో దోలెవాల్ గ్రామానికి చెందిన గురుప్రీత్ సింగ్‌కు( Gurpreet Singh ) బుల్లెట్ గాయం కావడంతో జగ్రాన్ ఆసుపత్రికి తరలించారు.
మీడియాలో వస్తున్న నివేదికల ప్రకారం.వివాదాస్పద భూమి తరాఫ్కోట్లీకి చెందిన మన్‌దీప్ సింగ్( Mandeep Singh ) అనే ఎన్ఆర్ఐది.
అతను ప్రస్తుతం విదేశాలలో నివసిస్తున్నాడు.నకిలీ పత్రాలను ఉపయోగించి కొందరు వ్యక్తులు తన భూమిలోని మెజారిటీ భాగాన్ని అక్రమంగా బదిలీ చేసుకున్నారని మన్‌దీప్ గతంలో ఆరోపించాడు.
అయితే మన్‌దీప్ చట్టపరమైన చర్యలకు దిగడంతో అతనికి అనుకులంగా తీర్పు ఇవ్వడంతో పాటు భూమిని జప్తు చేసింది.
"""/" /
ఈ క్రమంలో మంగళవారం వివాదాస్పద భూమి నుంచి పంటలు కోయడానికి ప్రత్యర్ధి బృందం తన పొలానికి వచ్చిందని మన్‌దీప్ సింగ్‌కు సమాచారం అందింది.
దీంతో అతను తన అనుచరులతో కలిసి పొలం వద్దకు పరుగులు తీశాడు.అయితే ప్రత్యర్ధి గ్రూపుకు చెందిన సాయుధ వ్యక్తులు వారిని అడ్డుకోగా.
ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలో గురుప్రీత్ సింగ్‌పై కాల్పులు జరిగాయి.సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనాస్థలిలో పరిశీలించింది.
ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని , విచారణ తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హర్కమల్ కౌర్ తెలిపారు.
"""/" /
కాగా.ప్రవాస భారతీయుల ఆస్తుల ఆక్రమణ కేసులు పెరుగుతున్న విషయాన్ని గత నెలలో పార్లమెంట్‌లో ప్రస్తావించారు పంజాబ్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు సత్నం సింగ్ సంధు.
( Satnam Singh Sandhu ) ఎన్ఆర్ఐల ప్రయోజనాలను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం బలమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
ఇటీవలి కాలంలో ఎన్ఆర్ఐలకు చెందిన ఆస్తుల భూ ఆక్రమణ కేసులు వేగంగా పెరుగుతున్నాయని , ఇది సమాజంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందన్నారు.