TDP Janasena : టీడీపీ జనసేన సీట్ల పంపకం .. అసలు ఇబ్బంది వీరితోనే ? 

తెలుగుదేశం , జనసేన పార్టీలు పొత్తు పెట్టుకోవడమే కాకుండా,  సీట్ల పంపకాలు కూడా చేసుకున్నాయి.

బీజేపీ తమతో కలిసి వచ్చినా,  రాకపోయినా తాము మాత్రం కలిసే ముందుకే వెళ్తాము అనే సంకేతాలను ఇచ్చేశాయి.

టీడీపీ జనసేన( TDP , Janasena ) కూటమితో కలిసి వచ్చే విషయంలో ఇంకా ఏ నిర్ణయం తేల్చకుండా బీజేపి పెద్దలు నాన్చుడు ధోరణి అవలంబిస్తూ ఉండడం తో, టిడిపి,  జనసేన లు ఒక అడుగు ముందుకే వేసి రెండు పార్టీల తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ప్రకటించాయి.

  జనసేన మొత్తం 24 సీట్లలో పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రకటించారు.

దీనిపై జనసేన నాయకులు నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. """/" / టిడిపి తో పొత్తు ఉంటే మాత్రం ఇన్ని తక్కువ సీట్లు తీసుకోవడం ఏమిటని సోషల్ మీడియా వేదిక జన సైనికులు ప్రశ్నిస్తున్నారు .

అయితే పవన్ మాత్రం పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు తీసుకున్నామనేది ముఖ్యం కాదని , మెజారిటీ సీట్లను గెలవడమే తమ ముందు ఉన్న లక్ష్యమని, అదీ కాకుండా వైసిపిని ఓడించడమే ప్రధాన లక్ష్యం కావాలంటూ పార్టీ శ్రేణులకు పవన్ పిలుపునిస్తున్నారు.

పవన్ ఎన్ని చెబుతున్నా జనసేన నాయకులు మాత్రం ఈ విషయంలో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది.

చాలా నియోజకవర్గాల్లో టిడిపి తో కలిసి వెళ్లే విషయంలో జనసేన నాయకులు ఆసక్తి చూపించడం లేదు.

జనసేన కు ఇన్ని తక్కువ సీట్లు కేటాయించడం ఏంటి అంటూ చాలామంది జనసేన పార్టీ నాయకులు మండిపడుతున్నారు.

సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టింగ్స్ ఈ అంశంపైనే కనిపిస్తున్నాయి.జనసేన నాయకులను రెచ్చ గొట్టే విధంగా అటు వైసీపీ సోషల్ మీడియా నాయకులు పోస్టింగ్స్ పెడుతున్నారు.

"""/" /  జనసేన( Janasena ) ను ముందుకు తీసుకెళ్లే విషయంలో పవన్ తడబాటుకి గురవుతూ టీడీపి ట్రాప్ లో పడిపోయారు అని విమర్శలు చేస్తున్నారు.

ప్రస్తుతం పవన్ కు సొంత పార్టీ నాయకులను ట్రాక్ లో పెట్టడం, అసంతృప్తులను బుజ్జగించడమే అతి పెద్ద సవాల్ గా మారింది.

వైసీపీ ( YCP ) ని ఓడించడమే లక్ష్యంగా పవన్ చెబుతూ సొంతంగా పార్టీని బలోపేతం చేసి , అధికారం వైపుకు తీసుకువెళ్లే విధంగా ఆయన ప్రయత్నించకపోవడం పైన సొంత పార్టీ నాయకులలోనూ అసంతృప్తి కనిపిస్తుంది .

ఈ తరహా అసంతృప్తులను బుజ్జగించి,  పార్టీ నాయకుల్లో నమ్మకం కలిగించి, వారిని ఎన్నికలకు సిద్ధం చేయాల్సిన బాధ్యత పవన్ పైనే ఉంది.

ఉద్యోగాలు పీకేస్తున్నారని ఆఫీసు గుమ్మానికే చేతబడి.. కలకలం రేపుతున్న క్షుద్రపూజల సామాగ్రి..