విటమిన్ డి ఎక్కువైతే.. ఆ జబ్బుల బారిన పడటం ఖాయం?
TeluguStop.com
శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన విటమిన్లలో `డి` విటమిన్ ఒకటి.ఇమ్యూనిటీ సిస్టమ్ బలంగా మారేందుకు, ఎముకలు దృఢంగా ఉండేందుకు మాత్రమే కాదు.
శరీరంలో ప్రతి కణం సరిగ్గా పనిచేయాలీ అంటే విటమిన్ డి చాలా అవసరం.
అందుకే విటమిన్ డి లోపానికి గురి కాకుండా ఉండాలని ఆరోగ్య నిపుణులు ఎప్పటికప్పుడు చెబుతుంటారు.
ఇక విటమిన్ డి.సూర్యరశ్మి మరియు పలు ఆహారాల ద్వారా పొందొచ్చు.
అలాగే ఇటీవల కాలంలో.విటమిన్ డి పెంచుకునేందుకు చాలా మంది టాబ్లెట్స్‌ను కూడా ఎక్కువగానే వాడుతున్నారు.
అయితే విటమిన్ డి మన శరీరానికి అవసరమే.అయినప్పటికీ.
అతిగా తీసుకుంటే అదే మన పాలిట శాపంగా మారుతుంది.విటమిన్ డి తక్కువైతే అనారోగ్య సమస్యలు వస్తాయని అందరికీ తెలుసు.
కానీ, ఎక్కువైనా జబ్బుల తప్పవని అంటున్నారు నిపుణులు.ముఖ్యంగా శరీరంలో విటమిన్ డి ఎక్కువేతే.
కాల్షియం కూడా పెరిగిపోతోంది.దాంతో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటం లేదా ఇతర కిడ్నీ వ్యాధులు వచ్చే రిస్క్ పెరుగుతుంది.
అలాగే విటమిన్ డి ఉండాల్సిన దాని కంటే మించి ఉంటే.తరచూ మూత్ర విసర్జన, అలసట, రక్త పోటు పెరగడం, తరచూ వికారంగా ఉండటం, వాంతులు వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి.
"""/" /
విటమిన్ డి లోపం ఏర్పడితే.ఎముకలు బలహీన పడతాయన్న విషయం అందరికీ తెలుసు.
కానీ, విటమిన్ డి ఎక్కువైనా ఎముకలకు ప్రమాదమే.ముఖ్యంగా ఎముక సాంద్రత తగ్గి పోతుంది.
అలాగే కండరాలు కూడా బలహీనంగా మారిపోతాయి.ఇక శరీరంలో విటమిన్ డి ఎక్కువైతే.
మలబద్ధకం, ఆకలి లేక పోవడం, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు కూడా ఏర్పడతాయి.
కాబట్టి, శరీరానికి అవసరమని చెప్పి అతిగా విటమిన్ డి సప్లిమెంట్స్ వాడటం మానుకోండి.
మంచు విష్ణు కన్నప్ప బిజినెస్ పరంగా ఓకే మరి సక్సెస్ పరంగా ఏం చేయబోతున్నాడు…