కేంద్ర విద్యుత్ బిల్లులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ
TeluguStop.com
కేంద్ర విద్యుత్ బిల్లులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగుతుంది.ఈ క్రమంలో విద్యుత్ బిల్లును వ్యతిరేకించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాస్తోందన్నారు.రాష్ట్రాలను సంప్రదించకుండా విద్యుత్ సవరణ బిల్లును తెచ్చారని కేసీఆర్ తెలిపారు.
ప్రతిపక్షాలు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కేంద్రం బిల్లు తీసుకొచ్చిందని మండిపడ్డారు.మోదీ విధానాలను బహిరంగంగా వ్యతిరేకించిన మొదటి వ్యక్తిని తానేనని చెప్పారు.
ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్ పై పెత్తనం చేసే హక్కు కేంద్రానికి లేదన్నారు.
కేంద్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు.బుల్డోజింగ్ చేసి దేశాన్ని నడపాలనుకుంటున్నారని విమర్శించారు.
స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ పెట్టాలని గెజిట్ లో కూడా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.
ఇదేందయ్యా ఇది.. బావిలో నీరు కోసం వెళ్తే పెట్రోల్ వస్తోంది