ఏపీ ,తెలంగాణ సీఎంల మధ్య వీటి పైనే చర్చ ?

టీడీపీ అధినేత,  ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు,  సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) భేటీ జరిగింది.

ఈ ఇద్దరు సీఎంలు మధ్య జరిగిన భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.చంద్రబాబు శిష్యుడుగా గతంలో టిడిపి( TDP )లో పనిచేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ సీఎం కావడం,  గురు శిష్యులు ఇద్దరు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉండడంతో , ఏపీ తెలంగాణ విభజన సమస్యల విషయంలో సానుకూల నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని అంత భావిస్తున్నారు.

"""/" /   అసలు ఈ ఇద్దరు మధ్య ఏ ఏ అంశాలకు సంబంధించిన చర్చ జరిగింది అనే దాని పైన అందరికీ ఆసక్తి నెలకొంది.

పునర్విభజన చట్టంలోని అంశాలు,  విభజన తర్వాత కూడా గత పదేళ్లుగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఇబ్బందులపై సీఎం చంద్రబాబు , రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.

ప్రజాభవన్ లో జరిగిన ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల నుంచి ముగ్గురు మంత్రులు , సిఎస్, ఇతర అధికారులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో ప్రధానంగా ఏపీకి హైదరాబాదులోని కొన్ని బిల్డింగులను కేటాయించాలని చంద్రబాబు( Chandrababu ) రేవంత్ రెడ్డిని కోరగా,  స్థిరాస్తి ఇచ్చే ప్రసక్తి లేదని రేవంత్ చంద్రబాబుకు తేల్చి చెప్పారట .

"""/" / అలాగే రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్ బకాయిలపైన రెండు రాష్ట్రాల అధికారులు ఎవరి  వాదన వారు వినిపించారట.

అయినా దీనిపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరోసారి చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు.  రెండు రాష్ట్రాల మధ్య అధికారుల స్థాయిలో ఒక కమిటీ,  మంత్రుల స్థాయిలో మరో కమిటీ వేసుకోవాలని, రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.

ఈ సందర్భంగా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు విషయం పైన రేవంత్ రెడ్డిని చంద్రబాబు ఆరా తీశారట .

ఏపీలో ఆ పథకాల అమలు సాధ్యసాధ్యనాలపైన ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించినట్లు సమాచారం.

మహిళ లగేజీలో రూ.161 కోట్ల విలువైన డ్రగ్స్.. ఇందులో అసలు ట్విస్ట్ ఇదే..?